వాస్తవ లెక్కలు చెప్పి పరిహారం ఇవ్వండి!

ABN , First Publish Date - 2021-06-22T06:26:15+05:30 IST

భానుగుడి (కాకినాడ), జూన్‌ 21: కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండు చేస్తూ కాకినాడ కలెక్టరేట్‌ ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమ వారం నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ,

వాస్తవ లెక్కలు చెప్పి పరిహారం ఇవ్వండి!
కలెక్టరేట్‌ వద్ద నిరసన నిర్వహిస్తున్న అఖిల పక్షం నాయకులు

మాజీ మంత్రి చినరాజప్ప 

అఖిల పక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిరసన

భానుగుడి (కాకినాడ), జూన్‌ 21: కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండు చేస్తూ కాకినాడ కలెక్టరేట్‌ ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమ వారం నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి పెద్దాపురం ఎమ్మెల్మే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ కరోనా మరణాలను దాచి పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ లెక్కలను ప్రకటించి, వారి కుటుంబాలను ఆదుకునేలా రూ.10 లక్షల పరి హారం చెల్లించాలన్నారు. అలాగే ఆదాయపన్ను దిగువనున్న వారందరికీ రూ.10 వేల కరోనా భృతి ఇవ్వాలన్నారు. ఆక్సిజన్‌ లేక మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండు చేశారు. టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మతోపాటు మేయర్‌ సుంకర పావని తదితరులు మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో కరోనా ఉధృతి తగ్గినా.. ఈ జిల్లాలో తగ్గకపోవడానికి అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆయన విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ అకాల వర్షాలతో కుదేలైన రైతులను, కరోనా కష్టకాలంలో తినడానికి తిండిలేకుండా ఉన్న అల్పాదాయ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలన్నారు. పీసీసీ రాష్ట్ర కార్య దర్శి నులకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో కరోనా ఉధృతి తగ్గినా, ఈ జిల్లాలో తగ్గకపోవడానికి కారణాలు తెలిపి, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు ఆకుల రమణ, తుల్కురి రాజు, సీపీఐ నాయకులు తోకల ప్రసాద్‌, నక్క కిషోర్‌, లోవరత్నం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T06:26:15+05:30 IST