పోలీసులు నన్ను వివస్త్రను చేయాలని ప్రయత్నం చేశారు.. : TDP మహిళా నేత సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2021-11-28T18:35:56+05:30 IST

పోలీసులు నన్ను వివస్త్రను చేసే ప్రయత్నం చేశారు.. : TDP మహిళా నేత సంచలన ఆరోపణ

పోలీసులు నన్ను వివస్త్రను చేయాలని ప్రయత్నం చేశారు.. : TDP మహిళా నేత సంచలన ఆరోపణలు

  • నాకు, నా కుటుంబానికి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత
  • విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి
  • కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆరోపణ

విశాఖపట్నం : తనకుగానీ, తన కుటుంబానికి గానీ ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజక వర్గం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై నిరసన తెలియజేస్తుంటే కేసులు నమోదుచేసి వేధిస్తున్నారని ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆమె విలే ఖరులతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నర్సీపట్నంలో జరిగిన ఆందోళనలో తాను పాల్గొంటే పోలీసులు తనపట్ల దుర్మార్గంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఆటోలోకి బలవంతంగా తీసుకువెళ్లడమేకాక తన చీరలాగి వివస్త్రను చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మహిళల హక్కులను హరించే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేరోజు ఎంతో దూరంలో లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని కోరారు.



Updated Date - 2021-11-28T18:35:56+05:30 IST