పేదలకు అన్యాయం చేస్తున్న సీఎం

ABN , First Publish Date - 2022-06-28T06:48:56+05:30 IST

పిఠాపురం, జూన్‌ 27: ఓట్లు కోసం సాధ్యం కాని హామీలు ఇచ్చుకుంటూ వచ్చిన సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు కోతలు విధిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ విమర్శించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో

పేదలకు అన్యాయం చేస్తున్న సీఎం
పిఠాపురంలో మాట్లాడుతున్న జ్యోతుల నవీన్‌

పిఠాపురం, జూన్‌ 27: ఓట్లు కోసం సాధ్యం కాని హామీలు ఇచ్చుకుంటూ వచ్చిన సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు కోతలు విధిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ విమర్శించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభు త్వం కూల్చివేతలు, రద్దులకే ప్రాధాన్యమిస్తుందన్నారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న నేతలపై కక్షసాధింపులకు పాల్పడుతున్నదని ఆరోపించారు. ఈ విషయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని కోరారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం గా ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీని మరింత పటిష్టపరిచేందుకు గానూ ప్రతి 25వేల మంది ఓటర్లును ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఇన్‌చార్జిగా ఒక నాయకుడిని నియమించడం జరిగిందని తెలిపారు. వర్మ మాట్లాడుతూ నియోజకవర్గంలోని బాదుడే బాదుడు కార్యక్రమానికి మంచి స్పందన లభించిందన్నారు. కేవలం 9గ్రామాలు, 5 వార్డుల్లోనే కార్యక్రమం చేయాల్సి ఉందన్నారు. సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపాలని కోరారు. వచ్చే నెల నుంచి పట్టణంలోని పాత టీడీపీ కార్యాలయంలో అన్నక్యాంటీన్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జూలై 1వ తేదిన జరిగే రైతు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొండేపూడి సూర్యప్రకాష్‌, ఎలుబండి రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T06:48:56+05:30 IST