చంద్రబాబు పర్యటనను విజయవంతం చేద్దాం

ABN , First Publish Date - 2022-05-17T05:35:11+05:30 IST

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఉమ్మడి జిల్లా పర్యటనను సమన్వయంతో పనిచేసి, విజయవంతం చేద్దామని హిందూపురం, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు బీకే పార్థసారథి, కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

చంద్రబాబు పర్యటనను విజయవంతం చేద్దాం

టీడీపీ ఉమ్మడి జిల్లా సమన్వయ కమిటీ నాయకులు.. ఏర్పాట్ల పరిశీలన

పుట్టపర్తి, మే 16 (ఆంధ్రజ్యోతి)/పెనుకొండ: తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఉమ్మడి జిల్లా పర్యటనను సమన్వయంతో పనిచేసి, విజయవంతం చేద్దామని హిందూపురం, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు బీకే పార్థసారథి, కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈనెల 20న సోమందేపల్లిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పెనుకొండలోని రోడ్లు, భవనాల అతిథి భవనంలో ఉమ్మడి జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు పర్యటన రూట్‌ మ్యాప్‌తోపాటు బహిరంగ సభ స్థలాన్ని వారు పరిశీలించారు. ఈసందర్బంగా బీకే పార్థసారథి, కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈనెల 19న రాత్రి చంద్రబాబు అనంతపురానికి చేరుకుంటారన్నారు. అనంతపురం జిల్లా సరిహద్దు గుత్తి నుంచి చంద్రబాబుకు అపూర్వ స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేద్దామన్నారు. అనంత నుంచి సోమందేపల్లి దాకా రోడ్డు పొడవునా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సోమందేపల్లి ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి వాల్మీకి సర్కిల్‌ మీదుగా బాదుడే బాదుడు ర్యాలీ సాగుతుందన్నారు. ప్రజలతోపాటు చేనేత, రైతులతో చంద్రబాబు ముఖాముఖి అవుతారన్నారు. అనంతరం ఎన్టీఆర్‌ సర్కిల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. సభకు ఉమ్మడి జిల్లా నుంచి 50వేల మందిదాకా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. అందుకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించారు. విద్యుత సరఫరాలో ఆటంకాలు కలిగించే అవకాశం ఉన్నందున ముందస్తుగా జనరేటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌చౌదరి, కందికుంట వెంకటప్రసాద్‌, హనుమంతరాయచౌదరి, ఈరన్న, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, యువనేత పరిటాల శ్రీరామ్‌, కళ్యాణదుర్గం ఇనచార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు, నాయకులు పూల నాగరాజు, మంటిమడుగు కేశవరెడ్డి, బీవీ వెంకటరాముడు, వెంకటశివుడు యాదవ్‌, శ్రీధర్‌చౌదరి, రామ్మోహనచౌదరి, ఆలం నరసానాయుడు, శ్రీనివాసమూర్తి, కాటమయ్య, బుగ్గయ్య చౌదరి, మురళి, గౌస్‌మోద్దీన, ఎంఎస్‌ రాజు, వడ్డె వెంకట్‌, కుంటిమద్ది రంగయ్య, అంబికా లక్ష్మీనారాయణ, కొల్లకుంట అంజినప్ప, సుబ్బరత్నమ్మ, రామాంజినమ్మ, రామసుబ్బమ్మ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-17T05:35:11+05:30 IST