చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు

ABN , First Publish Date - 2022-05-16T06:55:16+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఉమ్మడి జిల్లా పర్యటన ఖరారైంది. కాగా... ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి.

చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు

19న రాత్రి అనంతపురం రాక

అనంతపురం, మే15(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఉమ్మడి జిల్లా పర్యటన ఖరారైంది. కాగా... ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. 19వ తేదీ రాత్రి అనంతపురం నగరానికి చేరుకోనున్నారు. ఆ రాత్రి 8 గంటలకు తపోవనం సమీపంలోనున్న వీవీఆర్‌ ఫంక్షనహాల్‌లో ఆయన బస చేస్తారు. 20న ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకూ ఆ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. ఆ తరువాత 10.30 నుంచి 12.30 గంటల వరకూ పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకూ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం  బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా... శ్రీ సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లికి బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సోమందేపల్లిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకూ సోమందేపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. ఆ సభా వేదిక నుంచే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించనున్నారు. సభ ముగిసిన తరువాత నేరుగా బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. దీంతో చంద్రబాబు ఉమ్మడి జిల్లాలో ఒకరోజు పర్యటన ముగుస్తుంది.


నేడు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

పుట్టపర్తి, మే 15(ఆంధ్రజ్యోతి): సోమందేపల్లిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ అధినేత అధినేత చంద్రబాబునాయుడు పర్యటన ఖరారు నేపథ్యంలో సోమవారం పెనుకొండలో ఉమ్మడి జిల్లాల టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారథి తెలిపారు. పెనుకొండలోని రోడ్లు భవనాల అతిథి భవనంలో మధ్యాహ్నం సమావేశం ఉంటుందన్నారు. అనంతరం సోమందేపల్లిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనే రూట్‌మ్యా్‌పతోపాటు బహిరంగ సభ వేదిక స్థలాన్ని పరిశీలించనున్నారు. సమావేశానికి అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులుతోపాటు ఉమ్మడి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, నియోజక వర్గాల ఇనచార్జిలు, సమన్వయ కమిటీ సభ్యులు హాజరుకానున్నారు.


Updated Date - 2022-05-16T06:55:16+05:30 IST