నియంతపాలనకు రోజులు దగ్గరపడ్డాయి

ABN , First Publish Date - 2022-09-29T05:29:59+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు.

నియంతపాలనకు రోజులు దగ్గరపడ్డాయి

బాదుడే.. బాదుడులో బీకే 

పెనుకొండ, సెప్టెంబరు 28: రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో నియంతలా జగన వ్యవహరిస్తున్నాడన్నారు. మంగళవారం సాయంత్రం పట్టణంలో పార్థసారథి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై బ్యానర్లు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎగువగడ్డ, కుమ్మరదొడ్డి, బ్రాహ్మణవీది, రామాలయం వీది, తోటగేరి, చెరువు రోడ్డు ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ టీడీపీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ వైసీపీ వైఫల్యాలను ఎండగట్టారు. అనంతరం బీకే మాట్లాడుతూ మూడేళ్లుగా ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. వంట గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌, కరెంటు చార్జీలను పెంచారన్నారు. రైతులకు సంబంధించి విద్యుత మోటార్లకు మీటర్లు బిగించి నట్టేట ముంచారన్నారు. టీడీపీ పాలనలోనే పెనుకొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. రాబోయే ఎన్నికల్లో జగనకు ప్రజలు బుద్దిచెబుతారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి గుట్టూరు చిన్నవెంకటరాముడు, కేశవయ్య, కుంటిమద్ది రంగయ్య, వడ్డెర్ల సంఘం అధ్యక్షులు వడ్డె వెంకటేశ, అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, కురుబ కృష్ణమూర్తి, మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, నియోజకవర్గ అధ్యక్షులు చిన్నప్పయ్య, ప్రధాన కార్యదర్శి భానుకీర్తి, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణరెడ్డి, దారపునేని రామలింగ, కన్వీనర్లు రవిశంకర్‌, రఘువీర చౌదరి, బొక్సంపల్లి రామక్రిష్ణ, బోయ అశ్వర్థనారాయణ, త్రివేంద్ర, పోతిరెడ్డి, గుట్టూరు నాగరాజు, సర్పంచ శ్రీనివాసులు, టీఎనటీయుసీ అధ్యక్షులు పాలడుగు చంద్ర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బోయ హరిక్రిష్ణ, కన్వీనర్లు సిద్దలింగప్ప, సోమశేఖర్‌, నరహరి, హుజూర్‌, ఖాదిర్‌, జావిద్‌, మహ్మద్‌, దోణి లక్ష్మీనారాయణ, కన్నాస్వామి, బాబుల్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు గాయిత్రి, అనసూయమ్మ, చంద్రకాంతమ్మ, నరేంద్ర, సాయిప్రసాద్‌, నీలకంఠారెడ్డి, గంగులకుంట రమణ, అడదాకులపల్లి ఈశ్వర్‌ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-29T05:29:59+05:30 IST