Abn logo
Sep 23 2021 @ 23:51PM

రాబోయే రోజుల్లో టీడీపీదే అధికారం

టీడీపీలో చేరిన వారితో నాయకులు శ్రీనివాసరెడ్డి, దివాకర్‌రెడ్డి

  1. వైసీపీ నుంచి టీడీపీలో చేరిక 


ఎమ్మిగనూరు, సెప్టెంబరు23: రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి దివాకర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన పెద్దకడుబూరు మండలంలోని హెచ్‌. మురవణి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.  నాగరాజు, వీరేష్‌, లసుమన్న, పెద్దఈరన్న, బోయలింగన్న, బీమేష్‌, నరసింహులు, గోపాల్‌, భీమేష్‌, లక్ష్మన్న, రమేష్‌, బజారప్పలతోపాటు మరో 50 మందికి పార్టీ కండువాకప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిని వారికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ తిక్కారెడ్డి అండగా ఉంటారన్నారు. టీడీపీతోనే నిరుపేదలకు, బడుగుబలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి సల్మాన్‌ రాజు, మురవణి గ్రామనాయకులు సత్యన్నగౌడ్‌, రంగన్న, జనార్ధన్‌, శ్రీదేవమ్మ, దస్తగిరి, రంగన్న,సురేష్‌, లాజరు, తెలుగుయవత నాయకులు చెన్నకేశవ, వీరేష్‌ పాల్గోన్నారు.