Jangareddygudem: వరి నాట్లతో ఊడుపు ఊడ్చుతూ టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2022-07-13T19:35:07+05:30 IST

సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం జులై 15నాటికి రోడ్లు వేయాలంటూ జంగారెడ్డిగూడెంలో టీడీపీ నేతలు వినూత రీతిలో నిరసన చేపట్టారు.

Jangareddygudem: వరి నాట్లతో ఊడుపు ఊడ్చుతూ టీడీపీ నిరసన

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం జులై 15 నాటికి రోడ్లు వేయాలంటూ జంగారెడ్డిగూడెంలో టీడీపీ నేతలు(TDP leaders) వినూత రీతిలో నిరసన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు(Dasari Shyam Chandra Seshu) ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ (Saila Satyanarayana) అధ్యక్షతన జంగారెడ్డిగూడెం నుంచి మైసన్నగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై శ్రీనివాసపురం గ్రామంలో వరి నాట్లతో ఊడుపు ఊడ్చి నిరసన తెలియజేశారు. 

 

ఈ సందర్భంగా డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి గత నెల 21వ తేదీన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో చెప్పిన మాట ప్రకారం జులై15 నాటికి రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ పూర్తి చేసి ఫోటో గ్యాలరీ పెట్టాలని...ఇందుకు మరో రెండు రోజులే మిగిలి ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రోడ్ల నిర్మాణం కోసం రూ.2100 కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో సమాధానం చెప్పాలన్నారు.  ఈ రాష్ట్రంలో రోడ్లు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయన్నారు. దీంతో అనేక ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం లేదని కనీసం శానిటేషన్ కూడా లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. మాట తప్పి మడమ తిప్పిన ముఖ్యమంత్రి జగన్ తీరు మారకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బొబ్బర రాజపాల్, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబొయిన రామళింగేశ్వర రావు, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి పగడం సౌభాగ్యవతి, మండల ప్రధానకార్యదర్శి కుక్కల మాధవరావు, ఎస్సిసెల్ అధ్యక్షుడు గొల్లమందలశ్రీనివాస్, బీసీసెల్ అధ్యక్ష కార్యదర్శులు భూసా సత్యనారాయణ, రాగాని రామకృష్ణ, రైతు అధ్యక్షులు ఎలికే వర ప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు పొల్నాటి సత్యనారాయణ, పులపాకుల సూర్యచంద్రం తారిపిరెడ్డి రామకృష్ణ, నాయకులు వేములపల్లి శ్రీను, కేదాసు అర్జునరావు, తడికల మోహన్, కుర్రు అప్పారావు, కృష్ణంరాజు, తడికల దావీదు, నూనె పల్లారావు, సీతారామరాజు, పొల్నాటి రమేష్, తాళ్లూరి వెంకటేశ్వరరావు, కాగితాల పోసుబాబు, జొన్నకుటి శ్రీను, గదం గోపాలకృష్ణ, వేముల ఆంజనేయులు, రాగాని శ్రీను, జజ్జవరపు శ్రీను, షేక్ పెంట్ సాహెబ్,  దంసెల్లి ఆంజనేయులు, భోగవల్లి రత్నాజి, బి చిన్ని, మరిశెట్టి హరిబాబు, బాకీ రాంబాబు, నాలగోపి త్రిమూర్తులు, కొమ్ముకురి చినబాబు, వీరమళ్ల పోసుబాబు, నైనారపు నరేష్, దంసెల్లి సుబ్బారావు, కలపాల రాజు, కాగితాల శివయ్య బల్లె నాగార్జున, తగరం  వెంకటేశ్వరరావు, పొల్నాటి సత్తిబాబు, యంట్రపాటి శ్రీను, యడ్లపల్లి సింగ్,  దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-13T19:35:07+05:30 IST