రాష్ట్రంలో పెరిగిన గూండాయిజం

ABN , First Publish Date - 2021-10-20T04:39:10+05:30 IST

ప్రభుత్వంలో గూండాయిజం పెరిగిపోయిందని.. వాక్‌ స్వాతంత్య్రపు హక్కును కాలరాస్తున్నారని నరసాపురం నియోజకవర్గ ఇన్‌ ఛార్జి పొత్తూరి రామరాజు మండిపడ్డారు.

రాష్ట్రంలో పెరిగిన గూండాయిజం
నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు తదితరుల ఆందోళన

టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకుల దాడులు 

కాగడాలతో టీడీపీ నాయకుల నిరసన ప్రదర్శన

నరసాపురం, అక్టోబరు 19 : ప్రభుత్వంలో గూండాయిజం పెరిగిపోయిందని.. వాక్‌ స్వాతంత్య్రపు హక్కును కాలరాస్తున్నారని నరసాపురం నియోజకవర్గ ఇన్‌ ఛార్జి పొత్తూరి రామరాజు మండిపడ్డారు. టీడీపీ కార్యాలయం, ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాఽభి నివాసంపై వైసీపీ శ్రేణులు దాడి చేయడాన్ని నిరసిస్తూ మం గళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పొత్తూరి రామరాజు,మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో వేర్వేరుగా పురవీధుల్లో కాగడాల ప్రదర్శనతో నిరసన తెలిపారు. పొత్తూరి శివాలయం నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు కాగడాలతో ప్రదర్శన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీజీపీ కార్యాలయానికి సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తున్నా... పోలీ సులు స్పందించకపోవడం సిగ్గుచేట న్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో రాయపేట కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ చేశారు. బండారు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజారెడ్డి పాలన సాగుతోందన్నారు.ఆందోళనలో జక్కం శ్రీమన్నారయణ, కొల్లు పెద్దిరాజు, కొప్పాడ రవి, పాలూరి బాబ్జీ, రత్నమాల, అకన సుబ్రమణ్యం, భూపతి నరేష్‌, మల్లాడి మూర్తి, మౌలాలీ, పద్మ,చిటికెల రామ్మోహన్‌, బళ్ళ మూర్తి, దానియేలు,సత్తిబాబు, కృష్ణ, బెజవాడ రమేష్‌, రెడ్డిం శ్రీను పాల్గొన్నారు.  


మాట్లాడితే దాడులు చేస్తారా? : రామరాజు


ఆకివీడు, అక్టోబరు 19 : రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి స్వేచ్ఛ లేకుండా పోయిందని.. ఇదెక్కడి న్యాయమని ఎమ్మెల్యే మంతెన రామరాజు మండిపడ్డారు. ఆకివీడు డైలీ మార్కెట్‌లో ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు కొవ్వొ త్తులతో నిరసన ప్రదర్శన చేశారు.  విశాఖ, తిరుపతి, గుంటూరు టీడీపీ కార్యాలయాలతో పాటు పట్టాభి నివాసంపై వైసీపీ శ్రేణులు దాడులను ఖండించారు. దేశంలో ఇటువంటి దుష్టచర్యలు ఎక్కడైనా ఉన్నాయా అంటూ ఆగ్రహించారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని  టీడీపీ మండలాధ్యక్షుడు మోటుపల్లి రామవర ప్రసాద్‌ అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బొల్లా వెంకట్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మల్‌, భూపతిరాజు తిమ్మరాజు, గోరీబాబు, మండల–పట్టణ కార్యదర్శులు నౌకట్ల రామారావు, గంధం ఉమా, జాకీర్‌, ఆరీఫ్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి..


మొగల్తూరు,అక్టోబర్‌19: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాజీ జడ్పీటీసీ గుబ్బల నాగరాజు, మాజీ సర్పంచ్‌ మామిడిశెట్టి సత్యనారాయణ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బస్వాని ఏడుకొండలు అన్నారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తూమంగళవారం రాత్రి మొగల్తూరు గాంధీబొమ్మల సెంటర్‌లో టీడీపీ నాయకులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.దాడికి పాల్పడినవారిని గుర్తించి తక్షణమే అరెస్ట్‌ చేసి శిక్ష విధించాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తగిన రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.బొల్లా చంటి, పాలా రాంబాబు, కొల్లాటి బోగరాజు, పంపన భగవాన్‌, డొల్లా రత్నంరాజు, పితాని శేఖర్‌, గుండు శ్రీను, పెద్దిరాజు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T04:39:10+05:30 IST