Frankfurt: టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో ఈసారి ఘనంగా మహానాడు వేడుకలు

ABN , First Publish Date - 2022-04-26T18:51:17+05:30 IST

"ఏ దేశమేగినా ఎందుకాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.." అన్న మాటలను స్ఫూర్తిగా తీసుకుని మునుపెన్నడూ లేని విధంగా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో మినీ మహానాడు ఘనంగా జరుగబోతోంది.

Frankfurt: టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో ఈసారి ఘనంగా మహానాడు వేడుకలు

"ఏ దేశమేగినా ఎందుకాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.." అన్న మాటలను స్ఫూర్తిగా తీసుకుని మునుపెన్నడూ లేని విధంగా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో మినీ మహానాడు ఘనంగా జరుగబోతోంది. 2018 నుంచి జర్మనీలో ప్రతి సంవత్సరం మహానాడును తెలుగుదేశం పార్టీ అభిమానులు ఒక పండుగలా చేసుకుంటారు. అయితే, గడిచిన రెండేళ్లుగా కరోనా మహమ్మారి వల్ల ఆన్‌లైన్ పద్ధతిలో జరుపుకున్నారు. కానీ ఈసారి పెద్ద ఎత్తున్న సంబరాలు జరగాలి అని తెలుగుదేశం పార్టీ సిటీ కౌన్సిల్స్, తెలుగుదేశం పార్టీ అభిమానులు నిర్ణయించారు. ఏ కౌరవ సభలో అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి అవమానం జరిగిందో అదే అధ్యక్షున్ని గౌరవంగా ముఖ్యమంత్రి స్థానంలో ఆ సభకి పంపడానికి కృషి చేస్తున్నాం అని తెలుగుదేశం పార్టీ జర్మనీ సభ్యలు పేర్కొన్నారు. 


ఈ మహానాడులో కొంత మంది ముఖ్యమైన రాష్ట్ర నాయకులను జూమ్ మీటింగ్ ద్వారా ఆహ్వానించాం అని తెలిపారు. వాళ్ల ద్వారా తెలుగుదేశం పార్టీ జర్మనీ కార్యకర్తలలో స్ఫూర్తిని నింపే సందేశాలు ఇప్పిస్తాం అని తెలుగుదేశం పార్టీ సిటీ కౌన్సిల్స్ తెలిపింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య సభ్యులు వెంకట్ కాండ్ర, శ్రీకాంత్ కుడితి, నరేష్ కోనేరు, పవన్ కుర్రా, సుమంత్ కొర్రపాటి, అనిల్ మిక్కిలినేని, టిట్టు మద్దిపట్ల, శివ, వంశి దాసరి తదితర సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-26T18:51:17+05:30 IST