ఉండవల్లికి చేరుకుంటున్న టీడీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2022-06-25T23:00:42+05:30 IST

అమరావతి: ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు ఇంటి పక్కనే ముఖ్యమంత్రి అధికారిక కార్యకలాపాలు, కలెక్టర్ల సమావేశాల

ఉండవల్లికి చేరుకుంటున్న టీడీపీ శ్రేణులు

అమరావతి: ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు ఇంటి పక్కనే ముఖ్యమంత్రి అధికారిక కార్యకలాపాలు, కలెక్టర్ల సమావేశాల కోసం అప్పట్లో ప్రజా వేదికను నిర్మించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని అక్రమ కట్టడమంటూ కూల్చేసింది. దీనిపై టీడీపీ అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు సంవత్సరాల క్రితం జూన్ 25న జరిగిన ఘటనకు నిరసనగా.. ప్రజా వేదిక వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నాయి. అయితే లోపలికి వెళ్లనివ్వకుండా అరకిలో మీటర్ దూరంలో ఇనుప కంచె వేసి పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.


ఉండవల్లి గుహల వద్ద పోలీసులతో రైతుల వాగ్వాదం...

పొలం పనులకు వెళ్ళనివ్వకుండా ఉండవల్లి గుహల వద్ద ముళ్ళకంచెలు వేయటమేంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బుతో వేసుకున్న దారిని ఎలా మూసివేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రజా వేదిక వద్ద టీడీపీ నేతల నిరసన ప్రణాళికతో అప్రమత్తమైన పోలీసులు చంద్రబాబు ఇంటి సమీపంలో సిబ్బందిని మొహరించారు. కరకట్ట సమీపంలో వాహనాల రాకపోకలను నిలిపేశారు. చంద్రబాబు నివాసానికి దగ్గరలోని కొండవీటి వాగు, ఉండవల్లి గుహలు, సచివాలయం వైపు నుంచి వచ్చే మార్గాలను బారికేడ్లతో మూసేశారు. 


సీఎం డౌన్..డౌన్.. 

ఉండవల్లి గుహల వద్దకు చేరుకున్న తెలుగు యువత  కార్యకర్తలు సీఎం డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రజావేదిక వైపు వెళ్లేందుకు తెలుగు యువత కార్యక్తరలు యత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, తెలుగు యువత కార్యక్తరలు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.

Updated Date - 2022-06-25T23:00:42+05:30 IST