Abn logo
Sep 27 2021 @ 00:07AM

భారత బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు

రాయదుర్గంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం, సెప్టెంబరు 26: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సోమవారం నిర్వహించ తలపెట్టిన భా రత బంద్‌కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ప్రకటించారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయనతో పాటు సీపీఎం పట్టణ కార్యదర్శి మల్లికార్జున, సీపీఐ తాలుకా కార్యదర్శి నాగార్జున విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలు అమలైతే మద్దతు ధర ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం పూర్తి గా తగ్గిపోతుందన్నారు. ప్రైవేట్‌ శక్తుల చేతుల్లోకి మార్కెటింగ్‌ ధరల నియంత్రణ వెళ్లిపోతుందన్నారు. పెద్దపెద్ద కా ర్పొరేట్‌ శక్తులు భారీ స్థాయిలో గోదాములు నిర్మించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పదేళ్లపాటు నిల్వ చేసుకునే వె సులుబాటు వస్తుందన్నారు. దీని ద్వారా కృత్రిమ డిమాండ్‌ సృష్టించి అధిక ధరలకు విక్రయించే ప్రమాదం వుందన్నా రు. మార్కెటింగ్‌ శక్తుల ప్రభావం పెరిగి, ప్రభుత్వాల ని యంత్రణ పూర్తిగా తగ్గిపోయి రైతుకు, వినియోగదారునికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. కార్పొరేట్‌ సేద్యం వ ల్ల పూర్తిగా నష్టం వాటిల్లే పరిస్థితి వుందన్నారు. కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ విధానం అమలు చేసి కొందరు రైతుల భూము ల్లో సాగు చేయించి పదేళ్ల తరువాత భూమి పనికిరాకుం డా పోతుందన్నారు. వ్యవసాయ చట్టాలలో రైతులకు అనుకూలమైన సవరణలు చేసి మార్కెటింగ్‌, కార్పొరేట్‌ సెక్టార్‌ కు అనుకూలంగా కాకుండా, రైతులకు అనుకూలంగా మా ర్చడమే డిమాండ్‌ అన్నారు. ఇప్పటికే మార్కెట్‌ యార్డులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రకృతి శాపంతో పాటు పాలకుల పాపం తోడై రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం లో విలవిల్లాడుతున్నారన్నారు. వీటన్నింటినీ దృష్టిలో వుం చుకుని వామపక్ష పార్టీలతో కలసి భారత బంద్‌ను విజయవంతం చేసేందుకు ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ పా ల్గొని సంపూర్ణ మద్దతు ఇస్తోందని తెలిపారు. సమావేశం లో టీడీపీ నాయకులు పొరాళ్లు పురుషోత్తమ్‌, పసుపులేటి రాజు పాల్గొన్నారు.  


ఉరవకొండ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన భారతబంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని టీడీపీ పార్లమెంట్‌ జిల్లా ఉపాధ్యక్షుడు రేగాటి నాగరాజు, మడల కన్వీనర్‌ విజయ్‌భాస్కర్‌ పేర్కొన్నారు. స్థానిక రోడ్లు భవనాల వసతి గృహంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. రైతు ప్రయోజనాలకు టీడీపీ క ట్టుబడి ఉందన్నారు. రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలపై కేం ద్రం పునరాలోచించాలన్నారు. రాష్ట్రంలో వైసీపీ రైతు వ్యతిరేక పార్టీగా మిగిలిపోయిందన్నారు. డ్రిప్‌ రద్దు చేయడం వల్ల మెట్ట ప్రాంత రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రైతు భరోసా ద్వారా రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.7,500 మాత్రమే ఇస్తున్నారన్నారు. రైతులకు అందించే సబ్సిడీలను రద్దు చేసే ఘనత వైసీపీదేనన్నారు. రూ.3వేల కోట్లతో ఏర్పాటు చేస్తామన్న ధరల స్థిరీకరణ నిధి ఏమైంద ని ప్రశ్నించారు. సమావేశంలో టీడీపీ నాయకులు తిమ్మ ప్ప, గోవిందు, ప్యారం కేశవనందా, రాజేష్‌, రాజుగోపాల్‌, సుధాకర్‌, ఎర్రిస్వామి, రమేష్‌, వడ్డేచిన్నబాబు పాల్గొన్నారు. 


కళ్యాణదుర్గం: రైతు సమస్యల పరిష్కారం కోసం సో మవారం తలపెట్టిన భారత బంద్‌కు టీడీపీ సంపూర్ణ మ ద్దతు తెలియజేస్తున్నట్లు నియోజకవర్గ ఇనచార్జ్‌ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ బం ద్‌ను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిఽధులు పె ద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.


బొమ్మనహాళ్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్య తిరేక చట్టాలను నిరసిస్తూ సోమవారం చేపట్టిన భారత బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మండల టీడీపీ నా యకులు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ఉప్పరహా ళ్‌ క్రాస్‌ వద్ద తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండాపురం కేశవరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ బలరామిరెడ్డి విలేకరు లతో మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసా య నట్టచట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మండలంలో చేపట్టే బంద్‌లో తెలుగుదేశం పార్టీ నాయకు లు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.  కార్యక్రమంలో మాజీ సర్పంచ ఎస్‌పీ నాగరాజు, టీడీపీ నా యకులు యర్రగుంట్ల వెంకటేశులు, మోహన రెడ్డి, ఏకాంత, శ్రీకాంత రెడ్డి, శ్రీనివాసులు, మల్లికార్జునరెడ్డి, నాగరాజు, తేజశ్వరరెడ్డి, వీరశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు. 


యాడికి: కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలను వ్యతిరే కిస్తూ సోమవారం నిర్వహించనున్న భారతబంద్‌లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ మండ ల ప్రధాన కార్యదర్శి వీబీ వెంకటేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నల్లచట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 


గుంతకల్లు టౌన: కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం పిలుపునిచ్చిన భారత బంద్‌ను జయప్రదం చే యాలని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. ఆదివారం అ ఖిలపక్ష పార్టీల నాయకులు బంద్‌పై పట్టణంలో ఆటో ప్ర చారాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మా ట్లాడుతూ భారత బంద్‌లో కార్మికులు, రైతులు, ఉద్యోగులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి వీరభద్ర స్వామి, సీ పీఎం పట్టణ కార్యదర్శి బీ శ్రీనివాసులు, కాంగ్రెస్‌ పార్టీ ని యోజకవ్గ ఇన్చార్జి దౌల్తాపురం ప్రభాకర్‌, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి ఆలం నవాజ్‌, జిల్లా కన్వీనర్‌ శ్రీనివాసరాజు, టీడీపీ నాయకుడు హనుమంతు పాల్గొన్నారు.