Abn logo
Sep 17 2021 @ 02:05AM

రైతు కోసం తెలుగు దేశం

పీలేరు నాలుగు రోడ్ల కూడలిలో టీడీపీ శ్రేణుల ఆందోళన

జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు 

చిత్తూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి.. ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి.. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం మానుకోవాలి తదితర డిమాండ్లతో పాటు ఎన్నికలకు ముందు రైతులకు  జగన్‌ ఇచ్చిన పలు హామీలను నెరవేర్చాలని టీడీపీ నేతలు డిమాండు చేశారు. జిల్లావ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట  ‘రైతు కోసం.. తెలుగుదేశం’ కార్యక్రమాన్ని గురువారం టీడీపీ  శ్రేణులు చేపట్టాయి. ర్యాలీలు నిర్వహించి, తహసీల్దార్లకు వినతిపత్రాలను అందజేశాయి. ఫ పీలేరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి.దాదాపు గంటపాటు సాగిన ర్యాలీతో పట్టణం దద్ధరిల్లిపోయింది. ర్యాలీని అడ్డుకునేందుకు పలు దఫాలుగా పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్‌, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారపు రవిప్రకాష్‌ తదితర నేతలు పాల్గొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలోకి వెళ్లి అర్జీ ఇచ్చేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో డీఎస్పీ రవిమనోహరాచారితో మద్దిపట్ల సూర్యప్రకాష్‌కు మధ్య వాగ్వాదం జరిగింది.ఫ చిత్తూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు పాల్గొన్నారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.కాజూరు బాలాజీ తదితరులతో పాటు అధికారులకు వినతిపత్రాన్ని అందించారు.గుడిపాల,పూతలపట్టు మండల కేంద్రాల్లో స్థానిక నాయకుల నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఫ శాంతిపురంలో మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి పీఎస్‌ మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్‌లతో పాటు నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు కేజీఎఫ్‌ సర్కిల్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ధర్నా చేశారు. కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతుండగా.. పరిషత్‌ ఎన్నికల గురించి కోర్టు తీర్పునిచ్చిన విషయమై వైసీపీ నేతలూ అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కల్పించుకోవడంతో సద్దుమణిగింది.ఫ చంద్రగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు మెడలో వివిధ రకాల పంటల మాలలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎడ్ల బండ్ల మీద తహసీల్దార్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని అందించారు. అంతకుముందు టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతుండగా.. పరిషత్‌ ఫలితాలను విడుదల చేయాలని కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వైసీపీ శ్రేణులు రోడ్డుపై టపాసులు కాల్చారు. దాంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.ఫ సత్యవేడులో మాజీ ఎమ్మెల్యే హేమలత ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా ఆలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. మేదర కార్పొరేషన్‌ మాజీ  ఛైర్మన్‌ సుందరయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.బీఎన్‌కండ్రిగలో సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జేడీ రాజశేఖర్‌, జడ్పీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ సుందరరామిరెడ్డి, గ్రంథాలయ అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్‌ కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఫ వి.కోటలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌లో మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులు బైఠాయించాయి. ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాయి.ఫ మదనపల్లె, బి.కొత్తకోట, పెద్దమండ్యం, ములకలచెరువు, కురబలకోట మండలాల్లో టీడీపీ శ్రేణులు ‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమాన్ని చేపట్టారు. మదనపల్లెలోని చిప్పిలి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు వద్ద మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. బి.కొత్తకోటలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్వీన్‌తాజ్‌ ఆధ్వర్యంలో బస్లాండులో నిరసన తెలిపారు. ములకలచెరువు, పెద్దమండ్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, వినతిపత్రాలను అందజేశారు.ఫ ఏర్పేడులో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రేణులు ఎడ్ల బండిపై ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.ఫ పుంగనూరులో నియోజకవర్గ ఇన్‌చార్జి అనీషారెడ్డి,సమన్వయకర్త శ్రీనాథ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాయలం వరకు ర్యాలీ చేసి అధికారులకు వినతిపత్రం అందించారు. నిండ్రలో నగరి నియోజకవర్గ ఇన్‌చార్జి  గాలి భానుప్రకాష్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.గంగాధరనెల్లూరు మండలంలో తెలుగురైతు ప్రధాన కార్యదర్శి పాచిగుంట మనోహర నాయుడు,నియోజకవర్గ ఇన్‌చార్జి హరికృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.పంటలకు గిట్టుబాటు ధరల్లేవంటూ టమోటాలు పారబోసి నిరసన వ్యక్తం చేశారు.ఫ పూతలపట్టులో చిత్తూరు పార్లమెంటు టీడీపీ ప్రధానకార్యదర్శి కోదండయాదవ్‌, అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు.


పీలేరులో జరిగిన టీడీపీ ర్యాలీలో ముందు నడుస్తున్న కిశోర్‌ తదితరులు

నల్లారి కిశోర్‌ తదితరులపై కేసు 

పీలేరు, సెప్టెంబరు 16: పీలేరు పట్టణంలో ‘ రైతుల కోసం తెలుగుదేశం ’ పేరిట గురువారం నిర్వహించిన ర్యాలీ నేప థ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిపై పీలేరు అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాలీ సందర్భంగా కోవిడ్‌ నిబంధనలను ఉల్లం ఘించడం, అనుమతి లేకుండా బాణా సంచా పేల్చడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, 30 పోలీసుయాక్టును ఉల్లం ఘించడం వంటి చర్యలకు పాల్పడిన నేప థ్యంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఫిర్యాదుపై  కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్‌ తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్‌ , వాల్మీకిపురం మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ కంభం నిరంజన్‌రెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి కోటపల్లె బాబురెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు వారణాసి శ్రీకాంత్‌రెడ్డి, నిజాముద్దీన్‌, గీతమ్మ, మాజీ జడ్పీటీసీ రెడ్డిబాషా, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు అమరనాధరెడ్డి సహా మరికొందరిపై 143,188,341, 269,270, రెడ్‌విత్‌ 149ఐపీసీ, 3,4ఈడీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. 

చంద్రగిరి టవర్‌ క్లాక్‌ వద్ద బైఠాయించిన బీదా రవిచంద్ర, నాని తదితరులు


వి.కోట జాతీయ రహదారిలో అమర్‌ నేతృత్వంలో ధర్నా


గంగాధరనెల్లూరులో టమోటాలు పారబోసి నిరసన