విజయవాడ: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ(TDP farm steering committee) బృందం శుక్రవారం పర్యటించింది. అసాని తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను టీడీపీ బృందం పరిశీలించింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Somi reddy chandramohan reddy) నేతృత్వంలో పలు పంట పొలాలను టీడీపీ బృందం సభ్యులు పరిశీలించారు. ఈ క్రమంలో టీడీపీ బృందం వద్ద రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదు అని రైతులు ఆవేదన చెందారు.
ఇవి కూడా చదవండి