TDP Fact finding Committee: నేడు రేపల్లెకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ

ABN , First Publish Date - 2022-07-17T14:16:33+05:30 IST

నేడు రేపల్లెకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ (TDP Fact finding Committee) వెళ్తోంది. కమిటీలో మాజీమంత్రి నక్కా ఆనంద్బాబు

TDP Fact finding Committee: నేడు రేపల్లెకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ

గుంటూరు: నేడు రేపల్లెకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ (TDP Fact finding Committee) వెళ్తోంది. కమిటీలో మాజీమంత్రి నక్కా ఆనంద్బాబు (Nakka Anand Babu), ఎమ్మెల్సీ అశోక్బాబు, టీడీపీ నేత పట్టాభి, బుద్దా వెంకన్న ఉన్నారు. రెండ్రోజుల క్రితం పోటుమెరకలో మద్యం తాగి ఇద్దరు మృతి చెందారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కమిటీ సభ్యులు వెళ్తున్నారు. అయితే నిజనిర్ధారణ కమిటీకి పోలీసులు (police) ఆటంకాలు సృష్టిస్తున్నారు. రేపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే గుంటూరులో నక్కా ఆనంద్బాబును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. రేపల్లె టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు హౌస్ అరెస్ట్ చేశారు. రేపల్లెలో నిరసనలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. నిరసనలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 


రేపల్లె మండలం పోటుమెరక గ్రామంలో మద్యం సేవించిన గరికపాటి నాంచారయ్య (75), రేపల్లె రత్తయ్య (57) మృతి చెందారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇద్దరు మృతి చెందిన ఘటనపై వదంతులు నమ్మొద్దని, వారిద్దరూ అనారోగ్య కారణాలతో చనిపోయారని ఆ జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. కేసు విచారణ సమయంలో అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు. మృతులు తిన్న ఆహారం, తాగిన మద్యాన్ని సీజ్‌ చేసి ల్యాబ్‌కు పంపిస్తున్నామన్నారు. నివేదిక వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు. 


రేపల్లెలో మద్యం తాగిన అనంతరం ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన నేపథ్యంలో ఆరోపణలున్న రెండు బ్రాండ్ల అమ్మకాలను ఆపేయాలని బేవరేజెస్‌ కార్పొరేషన్‌.. మద్యం షాపులకు ఆదేశాలు జారీచేసింది. ఓల్డ్‌ స్మగ్లర్‌ బ్యాచ్‌ నంబరు 41, 8 పీఎం బ్యాచ్‌ నంబరు 61 అమ్మకాలను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ నిలిపివేయాలని స్పష్టం చేసింది. కాగా మద్యంలో విష పదార్థాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి తెలిపారు.

Updated Date - 2022-07-17T14:16:33+05:30 IST