వైసీపీ పాలనలో దళితులకు రక్షణ కరవు

ABN , First Publish Date - 2022-05-25T05:52:00+05:30 IST

కాకినాడ సిటీ, మే 24: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుం డా పోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు విమర్శించారు. మంగళవారం అఖిలపక్ష నేతలతో కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్యచేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కేసును సీబీఐ విచారించాలన్నారు. తక్షణం ఆయన ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలన్నారు. కాం

వైసీపీ పాలనలో దళితులకు రక్షణ కరవు

మాజీ మంత్రి  గొల్లపల్లి 

కాకినాడ సిటీ, మే 24: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుం డా పోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు విమర్శించారు. మంగళవారం అఖిలపక్ష నేతలతో కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్యచేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కేసును సీబీఐ విచారించాలన్నారు. తక్షణం ఆయన ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలన్నారు. కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మన్‌ కొరివి వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ అనంతబాబు ఘటనను సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు, దళిత హక్కుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జేవీ ప్రభాకర్‌, కె.సుబ్బారావు, పీసీసీ కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు చింతపల్లి అజయ్‌కుమార్‌, ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి పిట్టా వరప్రసాద్‌, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు జె.వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు తాళ్లూరి రాజు, పలువురు నాయకులు తుమ్మల రమేష్‌, కొల్లాబత్తుల అప్పారావు, సీకోటి అప్పకొండ, కె.సత్తిబాబు, పి.సత్యనారాయణ, జి.లోవరత్నం, ఎనుగుపల్లి కృష్ణ, బచ్చల కామేశ్వరరావు, కంభం రాజబాబు, వెంకట్రావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:52:00+05:30 IST