ఇంటింటికి సురక్షిత మంచినీరు

ABN , First Publish Date - 2021-03-05T06:12:27+05:30 IST

టీడీపీ మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి రవీంద ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయా వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు.

ఇంటింటికి సురక్షిత మంచినీరు
సీపీఐ అభ్యర్థి జంగాల రమాదేవికి మద్దతుగా అపార్టీ రాష్ట్ర నాయకులు కట్టా నారాయణతో కలసి ప్రచారంలో పాల్గొన్న కోవెలమూడి రవీంద్ర

నగరాన్ని అగ్రభాగంలో ఉంచుతాం

మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర

గుంటూరు(తూర్పు), మార్చి 4: టీడీపీ మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి రవీంద ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయా వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా గురువారం 8, 30, 43, 47 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్‌ పర్యటనల్లో  ప్రజలు తాగునీటికి పడుతున్న ఇబ్బందులను గమనించినట్టు  తెలిపారు. మేయర్‌గా అధికారం చేపట్టగానే సురక్షిత మంచి నీటిని ప్రజల హక్కుగా భావించి అందిస్తామని తెలిపారు. తాగునీటిని అందిచడంలో అధికార పార్టీ ఘోరంగా విఫలమైందని విమర్శించారు.

ఫ మహిళలకు పెద్దపీట

నగర పాలక సంస్థ ఎన్నికల్లో 32 సీట్లు కేటాయించి మహిళలకు పెద్దపీట వేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.  ప్రచారంలో భాగంగా 8 వ డివిజన్‌లో టీడీపీ బలపరిచిన సీపీఐ అభ్యర్థి జంగాల రమాదేవికి మద్దతుగా సీపీఐ రాష్ట్ర నాయకులు నారాయణ, ముప్పాళ్ళ నాగేశ్వరరావు, టీడీపీ తూర్పు ఇన్‌చార్జి నసీర్‌తో కలసి రవీంద్ర  ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికలు వచ్చాయని అమరావతిపై ముఖ్యమంత్రి కపట ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు. వైసీపీని సింగిల్‌ డిజిట్‌కే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు.


Updated Date - 2021-03-05T06:12:27+05:30 IST