గుంటూరు TDP జిల్లా అధ్యక్షుడు, క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-20T15:28:08+05:30 IST

గుంటూరు(Guntur) జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ(YCP) నేతల మట్టి దోపిడి నిరసిస్తూ..

గుంటూరు TDP జిల్లా అధ్యక్షుడు, క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు హౌస్ అరెస్ట్

గుంటూరు : గుంటూరు(Guntur) జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ(YCP) నేతల మట్టి దోపిడి నిరసిస్తూ నేడు చలో అనుమర్లపూడి కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ(TDP) నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ కుమార్, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల మ్యానీలు హౌస్ అరెస్ట్ చేశారు. చలో అనమర్లపూడి నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. అనమర్లపూడిలో భారీగా పోలీసులు మోహరించారు. అనమర్లపూడి వెళ్లే రోడ్లలో చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు.


Updated Date - 2022-06-20T15:28:08+05:30 IST