రైతు కోసం కదం తొక్కిన టీడీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2021-09-16T06:11:46+05:30 IST

‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ఆ పార్టీ శ్రేణులు విజయవంతం చేశాయి.

రైతు కోసం కదం తొక్కిన టీడీపీ శ్రేణులు
గూడెంలో పోలీసులు అడ్డుకోవడంతో బైఠాయించిన నాయకులు

రైతు సమస్యలు పరిష్కరించాలని నినాదాలు

యడ్లబండిపై వెళ్లి ‘గన్ని’ వినూత్న నిరసన

గూడెంలో పోలీసులు అడ్డుకోవడంతో నాయకుల బైఠాయింపు

‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ఆ పార్టీ శ్రేణులు విజయవంతం చేశాయి. పార్టీ నాయకులు నినాదాలతో హోరెత్తించారు. తాడేపల్లిగూడెంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించగా పోలీసులు అడ్డుకోవడంతో నాయకులు బైఠాయించారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌ గన్ని వీరాంజనేయులు యడ్ల బండిపై సబ్‌ స్టేషన్‌కు వెళ్లి  నిరసన తెలిపారు. 

తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబరు 15: రైతుల పట్ల ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు నీలాద్రిపురంలో నిర్వహించిన రైతు నిరసన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో  ర్యాలీ నిర్వహించారు.  ర్యాలీపై పోలీసు లు ఆంక్షలు విధించడంతో హౌసింగ్‌ బోర్డు ఎస్వీఆర్‌ విగ్రహం వద్ద తెలుగు దేశం నాయకులు బైఠాయించారు. శాంతియుతంగా చేస్తున్న నిరసన ర్యాలీని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని  బాబ్జి పేర్కొన్నారు.  తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మార్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం రైతుల కు వ్యతిరేకంగా పనిచేస్తూ రైతు ప్రభుత్వమని గొప్పలు చెబుతోందన్నారు. అనంతరం తహసీల్దార్‌ అప్పారావుకు వినతిపత్రం ఇచ్చారు. పార్టీ రాష్ట్ర ఆర్గనై జింగ్‌ కార్యదర్శి గొర్రెల శ్రీధర్‌, మండల అధ్యక్షుడు రవికుమార్‌, కిలపర్తి వెంక ట్రావు, తెలుగు రైతు నరసాపురం అధ్యక్షుడు రాంప్రసాద్‌ చౌదరి, పెద తాడే పల్లి సర్పంచ్‌ పోతుల అన్నవరం, నాయకులు వాడపల్లి వెంకట సుబ్బరాజు, శనగన శ్రీనివాస్‌, పరిమి వీరభద్రరావు, మద్దిపాటి ధర్మేంద్ర, మద్దుకూరి ధనరా జు, బేతపూడి వెంకటేశ్వరరావు, వట్టూరి రాంబాబు  తదితరులు పాల్గొన్నారు. 

తణుకు:  రైతు సమస్యలు పరిష్కరించాలని టీడీపీ నాయకులు స్థానిక నరేంద్ర సెంటర్లో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ ప్రసాద్‌కు  వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా  పలువురు నాయకులు మాట్లాడు తూ  రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామన్నారు. వర్షాలు పుష్కలంగా కురుస్తున్నా సాగునీరు అంద డం లేదన్నారు. విద్యుత్‌ మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్లు బిగించడమేన న్నారు.  టీడీపీ నాయకులు బసవా రామకృష్ణ, కలగర వెంకటకృష్ణ, పితాని మోహన్‌, చుక్కా సాయిబాబు, గుబ్బల శ్రీనివాసు, తేతలి సాయి, బత్తుల వెంకట రమణ, అత్తిలి, ఇరగవరం, రూరల్‌ మండలాల నాయకులు పాల్గొన్నారు.

ఉంగుటూరు: మండలంలోని గొల్లగూడెంలో టీడీపీ శ్రేణులు నిరసన తెలి పాయి. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌ గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎడ్ల బండిపై సబ్‌ స్టేషన్‌కు వెళ్ళి వ్యవసాయ బోర్లకు మీటర్లు వద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం పోలవరం కాలువలోకి దిగి రైతులకు మద్దతుగా నిరసన తెలిపారు.  భీమ డోలు, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం మండలాల నాయకులు పాతూరి విజయకుమార్‌, సిరిబత్తిన సత్యనారాయణ, ఇందుకూరి రామ కృష్ణంరాజు, రెడ్డి సూర్యచంద్రరావు, బొమ్మిడి అప్పారావు,  రవిశంకర్‌, ఆనంద్‌,  సుధీర్‌, యడ్ల శివ ప్రసాద్‌,  ఆశీర్వాదం,   గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.

పిప్పర (గణపవరం): ట్రూ అప్‌ ఛార్జీలు వెంటనే నిలుపుదల చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు డిమాండ్‌ చేశారు.  గొల్లగూడెంలో నిరసన కార్యక్రమానికి  గణపవరం మండలం నుంచి టీడీపీ నేతలు ర్యాలీగా తరలివెళ్లారు.   ఏలూరు పార్లమెంట్‌ టీడీపీ జిల్లా రైతు కార్యదర్శి కొదండ రాంబాబు, బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి యాళ్ల సుబ్బారావు, పార్టీ మొయ్యేరు అధ్యక్షుడు కానుమిల్లి చంటి, ముప్పర్తిపాడు అధ్యక్షుడు అల్లూరి బదిరి నారాయణ, మాజీ ఎంపీటీసీ జూపల్లి రాజేంద్ర  పాల్గొన్నారు. 

భీమడోలు: గొల్లగూడెంలో నిరసనకు టీడీపీ భీమడోలు మండల  నాయకులు తరలి వెళ్ళారు. టీడీపీ నాయకులు పుల్లయ్య, శిరిబత్తిన కొండ బాబు, సత్యనారాయణ, ప్రసాద్‌ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. 

నిడదవోలు: రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలకు స్వస్తి పల కాలని టీడీపీ పట్టణ  అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు అన్నారు.  బుధ వారం రైతుకోసం తెలుగుదేశం నినాదంతో నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.  తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.   పార్టీ మండల అధ్యక్షుడు మారిశెట్టి సత్యనారాయణ, పెరవలి మండల పార్టీ అధ్యక్షుడు సలాది కృష్ణమూర్తి,   సింహాద్రి రామకృష్ణ పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

పెరవలి:    టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా నిడదవోలు తరలి వెళ్లారు. పార్టీ మండల అధ్యక్షుడు సలాది కృష్ణమూర్తి, శిరిగినీడి శేషగిరిరావు, అబ్బిశెట్టి సత్తిరాజు, వకలపూడి వీర్రాజు, దాసం బాపన్ననాయుడు, హనుమంతు సుబ్రహ్మణ్యం, మానికిరెడ్డి మురళీకృష్ణ, మంగం రామారావు, కంటిపూడి  సూర్యనారాయణ, నల్లాకుల వెంకటేశ్వరరావు, బండారు బాబి, మారిశెట్టిదొర పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-16T06:11:46+05:30 IST