పోలీస్‌, విజిలెన్స్‌, మైనింగ్‌శాఖలు ఏం చేస్తున్నాయి?: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-05-30T22:00:24+05:30 IST

పోలీస్‌, విజిలెన్స్‌, మైనింగ్‌శాఖలు ఏం చేస్తున్నాయి?: దేవినేని ఉమ

పోలీస్‌, విజిలెన్స్‌, మైనింగ్‌శాఖలు ఏం చేస్తున్నాయి?: దేవినేని ఉమ

అమరావతి: పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన రూ.1,850 కోట్లు..లిక్కర్‌ కంపెనీలు, కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. పోలవరానికి ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఏడాది పాలనలో ఒక్క ఇల్లు అయినా కట్టారా?.  రూ.70 వేల కోట్ల రెవెన్యూలోటు ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటట్లేదని విమర్శించారు. అమరావతి కోసం 65 మంది రైతులు చనిపోతే కనీసం పరామర్శించలేదన్నారు. ఏడాదిలో ఒక్కసారైనా అమరావతి పేరు జగన్‌ నోటివెంట వచ్చిందా?. గోదావరి పాయల్లోంచి నీళ్లు తెస్తామన్నారు.. ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో కమీషన్లు దోచుకున్నారని ఆరోపించారు. శాండ్‌, ల్యాండ్‌, మైన్‌, వైన్‌ని దోచుకుంటున్నారని అన్నారు. నేషనల్‌ గ్రీన్‌ట్రిబ్యునల్‌ ఆదేశాలను లెక్కచేయకుండా లక్షల టన్నుల ఇసుకను పందికొక్కుల్లా తోడారు..పోలీస్‌, విజిలెన్స్‌, మైనింగ్‌శాఖలు ఏం చేస్తున్నాయి? అని ప్రశ్నించారు. 

Updated Date - 2020-05-30T22:00:24+05:30 IST