ఇంటికి 25వేలు పరిహారం ఇవ్వాలి : కోటంరెడ్డి

ABN , First Publish Date - 2020-11-29T05:30:00+05:30 IST

వరద వరద ముంపు ప్రాంతాల్లో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు, పూర్తిగా ధ్వంసమైన వాటికి రూ.25 వేలు చొప్పున నష్టపరిహరం వరద ముంపు ప్రాంతాల్లో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు, పూర్తిగా ధ్వంసమైన వాటికి రూ.25 వేలు చొప్పున నష్టపరిహరం ఇవ్వాలని టీడీపీ నగర ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇంటికి 25వేలు పరిహారం ఇవ్వాలి : కోటంరెడ్డి
వరద బాధితులకు అన్నదానం చేస్తున్న కోటంరెడ్డి

నెల్లూరు(వెంకటేశ్వరపురం), నవంబరు29 : వరద  ముంపు ప్రాంతాల్లో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు, పూర్తిగా ధ్వంసమైన వాటికి రూ.25 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ నగర ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి డిమాండ్‌ చేశారు. నెల్లూరులోని 48,49,50,53,54 డివిజన్లలో ఆదివారం ఆయన పర్యటించి వరద బాధితులను పరామర్శించారు.  అనంతరం వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్‌ కళాశాలలోని పునరావాస కేంద్రంలో అన్నదానం చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు తాము ముందుకొస్తుంటే వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు ప్రభుత్వం రూ.500 ఆర్థిక సాయం చేస్తామనడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జహీర్‌, సుధీర్‌, సుబ్బారావు, చంద్ర, రమాదేవి, గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


గణేష్‌ మిత్రమండలి సేవలు

నెల్లూరు(సాంస్కృతికం), నవంబరు 29 : పొర్లుకట్ట ప్రాంతంలోని వరద బాధితులకు గణేష్‌ మిత్రమండలి ఆదివారం ఆహార పొట్లాలు అందించింది. ఆ మిత్ర మండలి సభ్యులు మూడు రోజులుగా సేవలు అందిస్తున్నారు. వేదగిరి ఫణిశర్మ సహకారంతో బిస్కెట్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మిత్ర మండలి చైర్మన్‌ గాలి శ్రీధర్‌, వినయ్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


పాలు, బిస్కెట్ల పంపిణీ

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), నవంబరు 29: వరద ముంపు ప్రాంతాల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగ్‌దళ్‌ నాయకులు, కార్యకర్తలు ఆదివారం సేవలు అందించారు. మనుమసిద్ధినగర్‌, పొర్లుకట్ట, ఉయ్యాలకాలువ తదితర ప్రాంతాల్లో 800కుపైగా కుటుంబాలకు పాల ప్యాకెట్లు, బిస్కెట్లు, మినరల్‌ వాటర్‌ క్యాన్లు, కొవ్వొత్తులు, దోమల కడ్డీలు పంపిణీ చేశామని నాయకుడు యశ్వంత్‌సింగ్‌  తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత ప్రముఖ ప్రచారక్‌ బయ్యా వాసు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T05:30:00+05:30 IST