తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్‌ అక్రమ అరెస్టు

ABN , First Publish Date - 2021-06-18T06:35:42+05:30 IST

ఏపీపీఎస్సీ కార్యా లయం ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో పోలీ సులు నగర 26వ డివిజన్‌ కార్పొరేటర్‌, ఒంగో లు పార్లమెంట్‌ తెలుగు విద్యార్థి విభాగం అధ్య క్షుడు తిప్పరమల్లి రవితేజను అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ఆయన్ను స్థానిక వన్‌టౌన్‌ పో లీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్‌ అక్రమ అరెస్టు
ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

ఆందోళనకు దిగిన నాయకులు 

ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన


ఒంగోలు(క్రైం), జూలై 17 : ఏపీపీఎస్సీ కార్యా లయం ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో పోలీ సులు నగర 26వ డివిజన్‌ కార్పొరేటర్‌, ఒంగో లు పార్లమెంట్‌ తెలుగు విద్యార్థి విభాగం అధ్య క్షుడు తిప్పరమల్లి రవితేజను అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ఆయన్ను స్థానిక వన్‌టౌన్‌ పో లీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్తున్నప్ప టికీ రాత్రంతా స్టేషన్‌లోనే నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ వర్గాలు గురువా రం తెల్లవారేసరికి వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ వద్ద నిరసనకు సిద్ధమయ్యారు. అయితే వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో కా ర్యక్రమాన్ని ఎస్పీ కార్యాలయం వద్దకు మార్చా రు.  సమాచారం తెలుసుకున్న తాలూకా ఇన్‌స్పె క్టర్‌ శ్రీనివాసరెడ్డి టీడీపీ నాయకులతో మాట్లాడా రు. ఈ సందర్భంగా టీడీపీ నగర అధ్యక్షుడు కొ ఠారి నాగేశ్వరరావు నాయకత్వంలో ఆపార్టీ నా యకులు కార్పొరేటర్‌ రవితేజను పోలీసులు అక్ర మంగా నిర్బంధించారని, ఈ విషయాన్ని ఎస్పీకి తెలియజేసేందుకు వచ్చామని తెలిపారు. ఆయ న ఉన్నతాధికారులతో చర్చించి కార్పొరేటర్‌ రవి తేజను 41సీఆర్‌పీసీ ప్రకారం నోటీసులు ఇచ్చి వి డుదల చేయించారు. దీంతో టీడీపీ నాయకులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో టీడీ పీ నగర కార్యదర్శి దాయినేని ధర్మ, ఎద్దు శశికాం త్‌భూషణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


కార్పొరేటర్‌ అరెస్ట్‌ అమానుషం : దామచర్ల


ఒంగోలు (కార్పొరేషన్‌): టీడీపీకి చెందిన 26 వ వార్డు కార్పొరేటర్‌ తిపరమల్లి రవితేజ అక్రమ అరెస్టు అమానుషమని మాజీ ఎమ్మెల్యే దామచ ర్ల జనార్దన్‌ తెలిపారు. దీనిని తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందని చెప్పారు. రాత్రి వేళ సమయంలో ఇంటికి రావడమే కాకుండా ముందస్తు నోటీసు లేకుండా అరెస్టు చేయడం పోలీసులు దౌర్జన్యాని కి నిదర్శనంగా కనిపిస్తుంది. వన్‌టౌన్‌ సీఐ సీ తారామయ్య వైసీపీ నాయకుల మెప్పు కోసం టీ డీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బం దులకు గురి చేయడం దారుణమని విమర్శించా రు. ఈ సందర్భంగా రవితేజను ఫోన్‌ ద్వారా దా మచర్ల పరామర్శించారు. 


Updated Date - 2021-06-18T06:35:42+05:30 IST