శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. స్పందించిన సీతక్క

ABN , First Publish Date - 2021-07-09T17:27:02+05:30 IST

తెలంగాణ మహిళా నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. గిరిజనుల, ఆదివాసీల, పేదల బాధలు తీర్చడానికి..

శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. స్పందించిన సీతక్క

అమరావతి: ములుగు ఎమ్మెల్యే సీతక్క పుట్టినరోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన.. తెలంగాణ మహిళా నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. గిరిజనుల, ఆదివాసీల, పేదల బాధలు తీర్చడానికి అహర్నిశలు శ్రమించే సీతక్క సేవాగుణం స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ప్రజలే సర్వస్వంగా భావించే సీతక్క నిండు నూరేళ్ళూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. 




చంద్రబాబు ట్వీట్‌కు సీతక్క స్పందించారు. ‘అన్నా... థాంక్స్’ అంటూ రిప్లై ఇచ్చారు. 




పార్టీలు వేరైనా.. అనుబంధాలు.. ఆప్యాయతల విషయంలో ఇరువురు నాయకులు తమ ఔన్నత్యాన్ని ప్రతి సందర్భంలోనూ ప్రదర్శిస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

Updated Date - 2021-07-09T17:27:02+05:30 IST