అమరావతి: రాష్ట్రంలో మళ్లీ మూడు ముక్కలాటకు సీఎం జగన్ తెరతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మూడు రాజధానుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని ఆయన అన్నారు. విజయవాడ, గుంటూరు మధ్య పెడితే అభ్యంతరం లేదన్నారు. 33 వేల ఎకరాలు భూములను రైతులు ఇచ్చారని ఆయన తెలిపారు. మోసాలు, ఘోరాలు చేయడంలో మీరు దిట్ట అని వైసీపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. అధికార వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తి (జగన్) రాష్ట్రానికి సీఎం కావడం మన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రానికి ఒక శని గ్రహంలా తయారయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మక ద్రోహం చేసిన మీకు పాలించే హక్కు లేదన్నారు. ఇపుడే రాజీనామా చేయండి.. అప్పుడు రండి మాట్లాడుదామని ఆయన సవాల్ విసిరారు. ఇది భవిష్యత్ మూడు రాజధానుల అంశం తరతరాలపై ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని జగన్పై చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చట్టాలు చేయలేరని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి