Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొణిజేటి రోశయ్య మృతి బాధాకరం: Chandrababu naidu

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్  కొణిజేటి రోశయ్య మృతి పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య మృతి బాధాకరమన్నారు. రోశయ్య పరిపాలనాధక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారన్నారు. విద్యార్థి సంఘ  నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారని తెలిపారు. వివాదరహితుడిగా నిలిచారన్నారు. తనకప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహించేవారని కొనియాడారు. సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగి తన వంతు సేవలనందించారన్నారు. రోశయ్య మృతి పట్ల కుటుంబ సభ్యులకు, అభిమానులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement
Advertisement