అమరావతి: అల్లూరి సీతారామరాజు (Alluri sitaramaraju) 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం తెలుగు ప్రజలకే కాదు దేశానికే గర్వకారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) అన్నారు. బ్రిటిష్ పాలకులపై అలుపెరుగని పోరాటం చేశారన్నారు. స్వేచ్చ స్వతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసి 27 వయస్సులో మాతృ భూమికోసం ప్రాణాలు అర్పించారని అన్నారు. బ్రిటీష్ వారు సీతారామరాజును మట్టు పెట్టేందుకు ఆ రోజులలోనే 40 లక్షణాలు వెచ్చించారంటే అల్లూరి తన పోరాటంతో ఏ విధంగా భయపెట్టారో అర్థం అవుతుంది తెలిపారు. పార్లమెంటులో కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆజాదీకా అమృతోత్సవ్ (Azadika Amritotsav) కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) రాష్ట్రానికి వచ్చి ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రతి తెలుగు వారు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు కోరుకున్నారు.