అందరికీ ఎల్లాం నల్లా ఇరుక్కణం..: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-08T21:33:34+05:30 IST

జిల్లాలోని గుడిపల్లి మండలం జాతకర్తనపల్లి రోడ్ షోలో

అందరికీ ఎల్లాం నల్లా ఇరుక్కణం..:  చంద్రబాబు

చిత్తూరు: జిల్లాలోని గుడిపల్లి మండలం జాతకర్తనపల్లి రోడ్ షోలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలోని ప్రజలంతా  తమిళం మాట్లాడుతారని, వారందరికీ ఎల్లాం నల్లా ఇరుక్కణం అని తమిళంలో ఆయన అన్నారు. ఈసారి వచ్చేటపుడు తమిళం బాగా నేర్చుకుని మాట్లాడుతానని ఆయన పేర్కొన్నారు.  అంతకుముందు ఆయనకు మండల టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికారు.  అనంతరం మునీశ్వరుని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండపడ్డారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పులివెందుల్లో చేపల మార్కెట్, అక్కడక్కడా మటన్ మార్కెట్లను పెట్టి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇదే ఆయన జాబ్ చార్ట్  అని జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత బ్రాండ్లతో మద్యం పెట్టి ఆర్జిస్తున్నారన్నారు. భారతి సిమెంట్ ధరలు పెంచి లాభాలు ఆర్జిస్తూ, రాష్ట్రాన్ని దివాలా తేసేలా చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 



వారి పతనం మొదలైందని, రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి తథ్యమని ఆయన తేల్చి చెప్పారు.  జలగల్లాగ జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఈ సీఎం.. పేదల ద్రోహిగా నిలిచిన సీఏం అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో  జగన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమన్నారు. వలంటీర్ల ద్వారా సభలకు వెళ్ళ వద్దని భయపెట్టారని, అయినా మించిన ఉత్సాహంతో యువత వచ్చారన్నారు. ఎవరో ఇచ్చే పథకాలకు తన స్టిక్కర్ వేసే స్టిక్కర్ సీఎం జగన్ అని ఆయన ఎద్దేవా చేశారు. పీఎం  ఇచ్చిన నిధులకు మీరు స్టిక్కర్ వేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తన బటన్ తానే నొక్కుతానంటున్నాడన్నారు. పాలించే వారు బాగా లేకనే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిందన్నారు. ఇక్కడ అక్రమ, దొంగ క్వారీల వల్ల రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయని,  తాము అధికారంలోకి రాగానే వాటిపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-08T21:33:34+05:30 IST