టీడీపీ నేతపై వైసీపీ నేతల దాడిని ఖండించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2020-07-14T13:23:36+05:30 IST

చంద్రగిరి నియోజకవర్గం ఆర్‌సి పురం మండలం పూజగారి పల్లె సర్పంచ్‌గా సుబ్రమణ్యం పనిచేశారు.

టీడీపీ నేతపై వైసీపీ నేతల దాడిని ఖండించిన చంద్రబాబు

అమరావతి : టీడీపీ నేత సుబ్రమణ్య యాదవ్‌పై వైసీపీ నేతల దాడిని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్రమణ్యంకు ఫోన్ చేసిన బాబు ధైర్యం చెప్పారు. కాగా.. చంద్రగిరి నియోజకవర్గం ఆర్‌సి పురం మండలం పూజగారి పల్లె సర్పంచ్‌గా సుబ్రమణ్యం పనిచేశారు. జులై 12న సుబ్రమణ్య యాదవ్‌పై కొందరు వైసీపీ నాయకులు దాడిచేశారు. అయితే.. కేసు పెట్టడానికి స్టేషన్‌కు వెళ్తే అక్కడ పోలీసుల ఎదుటే మళ్లీ దాడికి ప్రయత్నించారు. అలాంటిది సుబ్రమణ్య యాదవ్ ఫిర్యాదు స్వీకరించకుండా తిరిగి ఆయనపైనే వాలంటీర్లతో ఎదురు కేసు పెట్టించడం ఏంటి..? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్రమణ్యం కొడుకు సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ను కూడా ఈ కేసులో ఇరికించడంపై మండిపడ్డారు. తప్పు చేసినవాళ్లపై చర్యలు తీసుకోకుండా బాధితులపైనే కేసులు బనాయించడం హేయంగా పేర్కొన్నారు. వైసీపీ దురాగతాలను మాజీ సీఎం ఖండించారు. టీడీపీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని సుబ్రమణ్యంకు బాబు భరోసా ఇచ్చారు.

Updated Date - 2020-07-14T13:23:36+05:30 IST