ముందస్తు ఎన్నికలకు సిద్ధం: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-01T22:18:25+05:30 IST

ఒకవేళ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే, వాటికి

ముందస్తు ఎన్నికలకు సిద్ధం: చంద్రబాబు

అమరావతి: ఒకవేళ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే, వాటికి సిద్ధంగా ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మీడియాతో  చంద్రబాబు చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అరాచకాలను ఎన్నికల్లో ప్రజలు ఎండగడతారన్నారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలపై ప్రచారం జరుగుతోందని, వస్తే సిద్ధంగా ఉన్నామన్నారు. పొత్తులపై ప్రశ్నలు ఊహాజనితమని, దానిపై తాను స్పందించనన్నారు. రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామన్నారు. పని చేయని నేతలు, ఇన్‌చార్జ్‌లను పక్కన పెట్టేస్తామన్నారు. ఎవరి కోసమో పార్టీ  త్యాగాలు చేయదని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-01T22:18:25+05:30 IST