Jubileehills: చంద్రబాబును కలిసిన మోహన్ బాబు.. గంటన్నరకు పైగా చర్చలు

ABN , First Publish Date - 2022-07-27T03:33:56+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను జూబ్లీహిల్స్‌లో సినీ నటుడు మోహన్‌బాబు (Mohanbabu) కలిశారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన ...

Jubileehills: చంద్రబాబును కలిసిన మోహన్ బాబు.. గంటన్నరకు పైగా చర్చలు

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను జూబ్లీహిల్స్‌లో సినీ నటుడు మోహన్‌బాబు (Mohanbabu) కలిశారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోహన్​బాబు.. తాజా రాజకీయాలపై దాదాపు గంటకుపైగా చర్చించుకున్నారు. అయితే వీరిద్దరి భేటీ ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. తన విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీఎయింబర్స్ మెంట్ చెల్లించలేదని.. గత ఎన్నికలకు ముందు తిరుపతిలో మోహన్ బాబు ఆందోళన నిర్వహించారు. రాస్తారోకో, ధర్నా చేపట్టారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు, మోహన్ బాబు మధ్య గ్యాప్ పెరిగింది. చాల రోజుల తర్వాత తాజాగా చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 


Updated Date - 2022-07-27T03:33:56+05:30 IST