చిత్తూరు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఏర్పేడు, తిరుపతి గ్రామీణ, చంద్రగిరి మండలాల్లో పర్యటన కొనసాగనుంది. వరద బాధితుల సమస్యలను బాబు అడిగి తెలుసుకోనున్నారు. వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను టీడీపీ అధినేత పరిశీలించనున్నారు. అనంతరం మధ్యాహ్నం తిరుపతిలో చంద్రబాబు పర్యటించనున్నారు.