టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలోని తెలుగు దేశం అభిమానులు కూడా తమ ప్రియతమ నాయకుడు చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను వైభవంగా నిర్వహించారు. రామకృష్ణ పార, గుమ్మడి శ్రీరాములు, రవిచంద్ర సింగ్, ఇతర టీడీపీ మద్దతుదారులు.. జోహాన్నెస్‌బర్గ్ నగరంలోని మిడ్రాడ్ ప్రాంతంలోగల న్యూ జెరుసెలం స్కూల్లో విద్యార్థుల మధ్య చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులకు నిత్యావసరాలు అందజేశారు.