సముద్ర జలాలపై వినూత్నంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు!

ABN , First Publish Date - 2022-04-21T22:37:49+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు అంగరంగా నిర్వహిస్తున్నారు.

సముద్ర జలాలపై వినూత్నంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు!

టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు అంగరంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నాట్స్ మాజీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్ కృష్ణ..  టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు జన్మదిన వేడుకలను జమైకా దీవుల్లో వినూత్నంగా నిర్వహించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఓడలలో ఒకటైన ‘హార్మొనీ అఫ్ ది సీస్’ షిప్‌లో బహమాస్, జమైకా దీవుల మధ్య కరీబియన్ సముద్రపు అలల హోరు నడుమ చంద్రబాబు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. 


మన్నవ మోహన్ కృష్ణ కేక్ కట్ చేసి టీడీపీ అధినేత చంద్రబాబు‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం మోహన్ కృష్ణ మాట్లాడుతూ అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదే‌శ్‌ను కాపాడగలిగే సమర్థవంతమైన నేత చంద్రబాబు నాయుడని ప్రశంసించారు. అట్టడుగున ఉన్న తమ మాతృభూమిని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడమే ప్రవాస భారతీయుల కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రతి ప్రవాస భారతీయుడు మాతృభూమి రుణం తీర్చుకోవడానికి, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలోకి తేవడానికి, చంద్రబాబును 2024లో సీఎం చేయడమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-04-21T22:37:49+05:30 IST