పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించండి

ABN , First Publish Date - 2021-08-06T06:14:23+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి ప్రజలను దోచుకుంటున్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించండి
కార్యక్రమంలో బొండా ఉమామహేశ్వరరావు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించండి

టీడీపీ సెంట్రల్‌ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌ వద్ద నిరసన, ధర్నా 

విద్యాధరపురం, ఆగస్టు 5 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి ప్రజలను దోచుకుంటున్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ సెంట్రల్‌ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చౌక్‌ వద్ద నిరసన, ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచడం వల్ల రాష్ట్రంలో సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేసే వ్యాట్‌ట్యాక్స్‌ను తగ్గించి కనీసం పెట్రోల్‌పై రూ.25, గ్యాస్‌ సిలిండర్‌ రూ. 200 ట్యాక్స్‌ను తగ్గించి ప్రజలపై పడుతున్న భారాలను తగ్గించాలని  డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ధరలు తగ్గించేంత వరకు టీడీపీ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. పార్టీ నాయకులు బాల, కార్పొరేటర్లు లలిత, దుర్గ, రామ్మోహన్‌, దాసరి జయరాజు, జి.చిన్న, పి.రామకృష్ణ, ఈ.వెంకటేశ్వరరావు, చలమలశెట్టి శ్రీను, వీరమాచినేని కిషోర్‌, దాసరి ఉదయశ్రీ, మద్దాల రుక్మిణి, రమణమ్మ, జి.రాధికా, చౌదరి, దాసరి పెప్సీ, భరణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-06T06:14:23+05:30 IST