ఎన్నికల్లో ఓడినా.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు

ABN , First Publish Date - 2021-04-16T17:45:51+05:30 IST

ఎన్నికల హామీలు అంటే.. చాలామటుకు..

ఎన్నికల్లో ఓడినా.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు

శభాష్‌.. పుల్లయ్యా..!


ప్యాపిలి(కర్నూలు): ఎన్నికల హామీలు అంటే.. చాలామటుకు నీటి మూటలే. ఇది నాయకులపై ప్రజలకున్న నిశ్చితాభిప్రాయం. విజయం సాధించినా.. హామీలు నెరవేర్చేందుకు చాలామంది మీన మేషాలు లెక్కిస్తారు. కానీ ఎన్నికల్లో ఓడినా.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంటింటికీ కొళాయి ఏర్పాటు చేయించాడు ఓ గ్రామస్థాయి నాయకుడు. ప్యాపిలి మండలంలోని చిన్నపూదిళ్లకు చెందిన టీడీపీ నాయకుడు ఆవుల బండ పుల్లయ్య పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఎన్నికల్లో తనకు సహకరిస్తే ఇంటింటికీ కొళాయి వేయిస్తానని ఎస్సీ కాలనీవాసులకు హామీ ఇచ్చాడు. ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయినా.. ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా కొళాయిలను ఏర్పాటు చేయించి, గురువారం ప్రారంభించారు. ఇందుకోసం ఆయన రూ.2 లక్షలు వెచ్చించారు. కాలనీ ప్రజలు పుల్లయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-04-16T17:45:51+05:30 IST