Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాపట్ల పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడిగా దండమూడి

రేపల్లె: టీడీపీ బలోపేతానికి బాపట్ల పార్లమెంటరీ కమిటీలో రేపల్లె నియోజకవర్గం నుంచి నలుగురిని ఎంపిక చేశామని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర అఽధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు బాపట్ల పార్లమెంటరీ టీడీపీ కమిటీ ఉపాధ్యక్షుడిగా దండమూడి వెంకటధరణికుమార్‌, అదికార ప్రతినిధులు గా కూచిపూడి మోహనరావు, విస్సంశెట్టి శ్రీనివాసరావు లను, కార్యనిర్వహణ కార్యదర్శిగా కుంచాల శివారెడ్డి, పిన్నిబోయిన లక్ష్మీనరసమ్మలను నియమించారని తెలిపా రు. నూతనంగా నియమించిన సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అదికార పార్టీ చేసే అసత్య ప్రచారాలను తిప్పికొట్టి, అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఎన్ని కైన సభ్యులకు టీడీపీ జిల్లా కార్యనిర్వహణకార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు, జీవీ నాగేశ్వరరావు, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ పంతాని మురళీధరరావు, వేములపల్లి సుబ్బారావు, మాజీ జడ్పీటీసీ మేకా వెంకటశివరామకృష్ణ, మాజీ ఎంపీపీ విచారపు వీరయ్య, పట్టణాధ్యక్షుడు గోగినేని పట్టాభిరామారావు, టీడీపీ నాయకులు నల్లూరు అజయ్‌కుమార్‌, వెనిగళ్ళ సుబ్రహ్మణ్యం, పరుచూరి విజయకుమార్‌, అన్నె రామకృష్ణ తదితరులు అభినందనలు తెలియజేశారు. 


అధికార ప్రతినిధిగా శ్రీనివాస్‌, కార్యదర్శిగా శివారెడ్డి

చెరుకుపల్లి: టీడీపీ బాపట్ల పార్లమెంటరీ నూతన కమిటీలో మండలానికి ప్రాధాన్యం దక్కిందని మండల అధ్యక్షు డు మల్లాది రామకృష్ణ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ సూచనల మేరకు బాపట్ల పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధిగా చెరుకుపల్లి పట్టణానికి చెం దిన విస్సంశెట్టి శ్రీనివాసరావు, కార్యనిర్వాహణ కార్యదర్శిగా కుం చల శివారెడ్డిని నియమిస్తూ రాష్ర్ట్ర అఽధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారని ఆయన తెలిపారు. పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తామని, తమమీద నమ్మకం ఉంచి పదవులు ఇచ్చిన అచ్చెన్నాయుడు, సత్యప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మండల పరిషత్‌ మాజీఉపాధ్యక్షుడు గడ్డిపాటి వెంకట్‌, ఎంఆర్‌కె మూర్తి, కాటూరు నాగేశ్వరరావు, ఎన్‌ సాయిబాబు, కే సీతారామయ్య, కోటయ్య, తదితరులు అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement