టీడీపీ బంద్‌ విజయవంతం

ABN , First Publish Date - 2021-10-21T05:55:38+05:30 IST

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులను ఖండిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది.

టీడీపీ బంద్‌ విజయవంతం
మాజీ ఎమ్మెల్యే కందులను హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు

వైసీపీ దాడులను  ఖండించిన శ్రేణులు

మాజీ ఎమ్మెల్యేలు అశోక్‌రెడ్డి, కందుల హౌస్‌ అరెస్ట్‌  

పలుచోట్ల నిరసనలు, ర్యాలీలు

అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు

గిద్దలూరు, అక్టోబరు 20 : తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులను ఖండిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. బంద్‌ కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. అందలోభాగంగా ప్రధాన నాయకులను హౌస్‌ అరెస్టులు చేశారు. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. బంద్‌లో పాల్గొనేందుకు మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి,  నాయకులు తమ ఇంటి నుంచి బయటకు  వెళ్లేందుకు ప్రయత్నించగా ఎస్‌ఐ బ్రహ్మనాయుడు, సిబ్బందితో వచ్చి అడ్డుకున్నారు. దాంతో అశోక్‌రెడ్డి రోడ్డుపై బైఠా యించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పట్టపగలే వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం, పట్టాభి ఇంటిపై కర్రలు, రాళ్లు, రాడ్లతో దాడి చేసి ధ్వంసం చేయడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా జగన్‌రెడ్డి మీనమేషాలు లెక్కి స్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలన, ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ పోరాటాలను మరింత ఉధృతం చేస్తుందన్నారు. కార్యక్రమంలో పట్టణ, మం డల  టీడీపీ అధ్యక్షులు సయ్యద్‌ షాన్షావలి, మార్తాల సుబ్బారెడ్డి, తిమ్మాపురం సర్పంచ్‌ పుసుపల మల్లేష్‌,  నాయకులు గోపాల్‌రెడ్డి, మహబూబ్‌బాషా, దూదేకుల దస్తగిరి, బొర్రా రాఘవేంద్రయాదవ్‌, గర్రె సాయి, బోయిళ్ల పల్లి కిశోర్‌కుమార్‌  పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కందుల అరెస్టు

మార్కాపురం : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాయలంపై వైసీపీ దుండ గులు చేసిన దాడిని నిరసిస్తూ పార్టీ పిలుపు మేరకు  మాజీ ఎమ్మెల్యే కందు ల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బంద్‌కు సిద్ధమయ్యారు. తెల్ల వా రుజామున 5 గంటల సమయంలో కళాశాల రోడ్డులోని ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపో గేటు వద్ద బైఠాయించారు. సీఐ బీటీ నాయక్‌, పట్టణ, రూరల్‌ ఎస్సైలు వై.నాగరాజు, జి.కోటయ్య అక్కడకు చేరుకున్నారు. కందులను బంద్‌ను విరమించాలని కోరారు. నిరాకరించడంతో బలవంతంగా ఇంటికి తరలించి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఇంటి నుంచి బయ టకు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. హౌస్‌ అరెస్ట్‌ చేసిన వారి లో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వక్కలగడ్డ మల్లికార్జున, టీడీపీ జిల్లా ప్రధాన కార్య దర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీర బ్రహ్మం, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కాకర్ల శ్రీనివాసులు, కౌన్సిలర్లు యేరువ నారా యణరెడ్డి, నాలి కొండయ్య యాదవ్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్‌ మౌ లాలీ, ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు అల్లంపల్లి శ్రీని వాసులు, టీడీపీ మండల అధ్యక్షుడు జవ్వాజి రామాంజనేయులు, వైసీపీ నాయకులు గఫార్‌, తాండ్ర వెంకటేశ్వర్లు ఉన్నారు. 

కంభంలో..

కంభం :   టీడీపీ కార్యాలయాలపై దాడిని ఖండిస్తూ  నాయకులు, కార్య కర్తలు కందులాపురం సెంటర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాసులు, కేతం శ్రీనివాసులు తదితర నాయకులు పాల్గొన్నారు. పోలీసులు నాయకు ల ను అదుపులోకి తీసుకున్నారు. 

రాచర్లలో..

రాచర్ల :  రాచర్లలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.  మండల అధ్యక్షుడు కె.యోగానంద్‌ను  పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. అనంతరం యోగానంద్‌ ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు.  కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మిరెడ్డి, టీడీపీ నాయకులు నరేంద్ర, స నావుల్లాఖాన్‌, వెంకటపతి, చక్రియాదవ్‌, శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, హఫీజ్‌ఖాన్‌, ఆరోగ్యం, చాంద్‌భాషా, అశోక్‌, రమేష్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

తర్లుపాడులో..

తర్లుపాడు : టీడీపీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తర్లుపాడులోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కంచెర్ల కాశయ్య మాట్లాడుతూ వైసీపీ నాయకులు గూండాయిజం చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.  దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఉడుముల చిన్నపురెడ్డి, మాజీ  ఎంపీపీ పులవే ముల యేసుదాసు, మాజీ ఎంపీటీసీలు పుచ్చనూతల గోపీనాథ్‌ చౌదరి,  వీరయ్య,  నంబుల లక్ష్మయ్య, కూచిపూడి సోమయ్య, మేకల వెంకటనా రాయణ, ఈర్ల వెంకటయ్య, నరసింహులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పొదిలిలో.. 

పొదిలి :  టీడీపీ నాయకులు, కార్యకర్తలు పొదిలిలో బంద్‌ నిర్వహించారు.  తెల్లవారుజామునే ఆర్టీసీ డిపో వద్దకు వెళ్లి బస్సులను అడ్డుకున్నారు. అనంతరం పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా దుకాణాలను మూసివేయించారు. పెద్దబస్టాండ్‌ సమీపంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్‌ రఫికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మీగడ ఓబుల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముల్లాఖుద్దూస్‌, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవులూరి యల మంద, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్‌, జిల్లా నాయకులు షేక్‌ రసూల్‌, సామంతపూడి నాగేశ్వరరావు, డాక్టర్‌ ఎస్‌డీ ఇమాంసా, షేక్‌గౌస్‌, వై.వెంకటేశ్వరరెడ్డి, పొల్లా నరిసింహారావు, షాహిద్‌, మండల నాయకులు పాల్గొన్నారు. 

బేస్తవారపేటలో ..

బేస్తవారపేట : బేస్తవారపేట పట్టణంలో టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  గాజుల విశ్వనాథం,  మూప్పూరి రాము, సుల్తాన్‌, మెకానిక్‌ రసీద్‌, దోమల రమణ పాల్గొన్నారు.

కొమరోలులో..

కొమరోలు : రాష్ట్రంలోని టీడీపీ పార్టీ కార్యాలయాలపై చేసిన దాడిని  జిల్లా రైతు కార్యదర్శి వీవీ రాఘవరెడ్ది తీవ్రంగా ఖండించారు. మండల కేంర దంలో బుధవారం  నిరసన కార్యాక్రమాన్ని చేపట్టారు. మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులు శ్రీనివాసచౌదరిని పోలీసులు ఇంటివద్దే  అరెస్టు చేశారు. దీంతో మండల నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు ముత్తుముల సంజీవరెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా  తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా ఎస్‌ఐ సాంబశివయ్య అడ్డుకున్నారు.   

వై.పాలెంలో.. 

ఎర్రగొండపాలెం : బంద్‌ కార్యక్రమాన్ని పోలీసులు అడుగడునా అడ్డుకున్నారు. ర్యాలీ చేస్తున్న టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మన్నె రవీంద్ర, మండల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నేతల అరెస్టుతో గ్రామాల నుం చి కార్యకర్తలు మాచర్ల బస్టాండ్‌ వద్ద రాస్తారోకోకు దిగారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, మాజీ అధ్యక్షులు షేక్‌జిలానీ, లింగయ్య,   వెంకటేశ్వర్లు,నారాయణరెడ్డి,  మహేష్‌, కోటయ్య, వెంగళరెడ్డి, సత్యనారాయణగౌడ్‌, శివరామకృష్ణ, గోళ్ల సుబ్బారావు, గుమ్మా ఎ ల్లయ్య, చేదూరి కిశోర్‌, చిమటా వెంకటరాములు, చలమయ్య, వెంకటేశ్వర్లు, షేక్‌ రఫి, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాలకు చెందిన కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. 

త్రిపురాంతకంలో..

త్రిపురాంతకం :  వైసీపీ దాడులను ఖండిస్తూ బంద్‌ నిర్వహించేందుకు సిద్ధమైన టీడీ పీ నాయకులును పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాజీ కన్వీనర్‌ మోటకట్ల శ్రీనివాసరెడ్డి ఇంటివద్ద ఎస్‌ఐ వెంకటకృష్ణయ్య, దూపాడులో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల నాసరరెడ్డి, మిట్టపాలెంలో మండల కన్వీనర్‌ ఊట్ల సీతయ్యలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఎండూరివారిపాలెంలో టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.

దోర్నాలలో..

పెద్ద దోర్నాల : రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడలేని ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన అమలు చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు ఏర్వ మల్లికార్జున రెడ్డి గవర్నర్‌ను కోరారు. టీడీపీ జాతీయ కార్యాలయంపై పలు చోట్ల వైసీపీ నాయకులు దాడులు ని ర్వహించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర పార్టీ బుధవారం బందుకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ సీనియర్‌ నాయకుడు అంబటి వీరారెడ్డి, బట్టు సుధాకర్‌ రెడ్డి, రావిక్రింధి సుబ్బరత్నం, జడి లక్ష్మయ్యను గృహ నిర్భంధంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దొడ్డా శేషాద్రి, మల్లయ్య, నాగేంద్రబాబు పాల్గొన్నారు.

పుల్లలచెరువులో..

పుల్లలచెరువు : టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా  తలపెట్టిన బంద్‌ ప్రశాతంగా ముగిసింది. టీడీపీ మండలాధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్‌ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఐదు గంటలకు ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై లారీల రాకపోకలను నిలిపివేశారు. రోడ్డుపై నిరసన తెలిపారు. అనంతరం వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉప్పల హనుమంతు, గజ్వేల్లి భాస్కర్‌, కె.లాలయ్య, వీరయ్య, వీ రాంజి, యల్లయ్య పాల్గొన్నారు. 




Updated Date - 2021-10-21T05:55:38+05:30 IST