Abn logo
Sep 26 2021 @ 23:53PM

ఆర్చి కూల్చివేత దుర్మార్గపు చర్య

ఆర్చి కూల్చివేసిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు

టీడీపీ ఇనచార్జి డాక్టర్‌ అరవిందబాబు

రొంపిచర్ల, సెప్టెంబరు 26: మండలంలోని మర్రిచెట్టుపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన ఆర్చిని శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. సమాచారం తెలుసుకున్న టీడీపీ ఇనచార్జ్‌ డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆర్చీలను కూల్చివేస్తున్నారన్నారు.భవిష్యత్తులో వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో వైసీపీ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ దుర్ఘటనకు పాల్పడినవారిని అరెస్టు చేయాలని ఎస్‌ఐ హజరత్తయ్యను కోరారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు.