రోడ్లపై నాట్లు

ABN , First Publish Date - 2021-07-25T05:27:57+05:30 IST

జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా ప్రభు త్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ తెలుగుదేశం జిల్లా వ్యాప్తంగా శనివారం నిరసనలకు దిగింది.

రోడ్లపై నాట్లు
రోడ్డుపై నాట్లు వేస్తున్న ఎమ్మెల్యేలు నిమ్మల, రామరాజు తదితరులు

 రహదారుల దుస్థితిపై తెలుగుదేశం నిరసన 

(ఏలూరు– ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా ప్రభు త్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ తెలుగుదేశం జిల్లా వ్యాప్తంగా శనివారం నిరసనలకు దిగింది. ఆకివీడు మండలం గుమ్ములూరు మార్గంలో అత్యంత దయనీయంగా గోతులు తేలి నీరు నిండిన ప్రాంతంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే రామరాజు, మాజీ మంత్రి పీతల సుజాత పార్టీ కార్యకర్తలు వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి వాస్తవాలు తెలియడం లేదని కొవిడ్‌ భయంతో తాడేపల్లి దాటి రావడం లేదని ఆక్షేపించారు. మరోవైపు పెదవేగి మండలం నడిపల్లిలో మాజీ చీఫ్‌ విప్‌ చింత మనేని ప్రభాకర్‌ కార్యకర్తలతో కలిసి గోతులను పూడ్చడానికి ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మేము పూడ్చకపోతే ఇంకె వరు పూడుస్తారంటూ ఎద్దేవా చేస్తూ మరమ్మతులకు ఉపక్రమించారు. కొయ్య లగూడెంలో ఏలూరులో పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు గన్ని వీరాంజనే యులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కన్వీనర్లు నిరసనకు దిగగా దేవరపల్లిలో మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు రోడ్డుపైనే నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-07-25T05:27:57+05:30 IST