Abn logo
Sep 21 2021 @ 00:10AM

చంద్రబాబును తాకడం కొడాలి తరం కాదు

ర్యాలీ నిర్వహిస్తున్న టీ డీపీ నాయకులు.

టీడీపీ నేత కోటంరెడ్డి

నెల్లూరు (వెంకటేశ్వరపురం), సెప్టెంబరు 20 : చంద్రబాబుని టచ్‌ చేయడం కొడాలి తరంకాదు గదా.... ఎవరితరం కాద ని, చంద్రబాబు నాయుడుని ఏమైనా అంటే కొడాలి నాని రాష్ట్రంలో తిరగలేరని, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హెచ్చరించారు.  పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో నగరంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మినీబైపాస్‌లోని మిలీనియం సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ బిల్లులు ఇంత భారీగా పెంచడం వల్ల ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సత్య నాగేశ్వరరావు, రేవతి, శైలజ, కప్పిర శ్రీనివాసులు, భువనేశ్వరీ ప్రసాద్‌, రాజా తదితరులు పాల్గొన్నారు. 


విద్యుత్‌ చార్జీలు తగ్గించాలి

సబ్‌స్టేషన్‌ ముందు సీపీఎం ధర్నా

నెల్లూరు (వెంకటేశ్వరపురం), సెప్టెంబరు 20 : విద్యుత్‌ సర్దుబాటు చార్జీల పేరుతో పేదలపై అధిక బిల్లులు వేయడాన్ని వెంటనే ఆపాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నాగేశ్వరరావు డిమాండ్‌ చేశాడు. నగరంలోని వెంకటేశ్వరపురం పరిధిలో ఉన్న జనార్దన్‌రెడ్డి కాలనీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముందు సోమవారం ధర్నా చేశారు. అంతకుముందు స్థానికంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్‌ అధికారికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్‌, జాఫర్‌, సునీల్‌ , మున్నా, వెంకటేశ్వర్లు జయరాం తదితరులు పాల్గొన్నారు.