Advertisement
Advertisement
Abn logo
Advertisement

పామర్రు మండలం కొమరవోలులో టీడీపీ కార్యకర్తల నిరసన

కృష్ణా: పామర్రు మండలం కొమరవోలులో టీడీపీ కార్యకర్తల నిరసనకు దిగారు. కొమరవోలు భువనేశ్వరి దత్తత గ్రామం కావడంతో పెద్ద సంఖ్యలో ధర్నాలో గ్రామస్తులు పాల్గొన్నారు. పామర్రు- కత్తిపూడి రహదారిపై టీడీపీ శ్రేణుల ధర్నాకు దిగారు. ధర్నాలో టీడీపీ నేతలు పట్టాభి, బోడె ప్రసాద్‌, వర్లకుమార్‌రాజా పాల్గొన్నారు. టీడీపీ నేతల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదానికి దిగారు. టీడీపీ ఇన్‌ఛార్జ్‌ వర్లకుమార్‌రాజాను పోలీసులు ఈడ్చుకెళ్లారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణుల నినాదాలు చేశారు.

Advertisement
Advertisement