శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల వేధింపులకు టీడీపీ కార్యకర్త మృతి

ABN , First Publish Date - 2022-03-08T13:42:23+05:30 IST

శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల వేధింపులకు టీడీపీ కార్యకర్త మృతిచెందాడు.

శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల వేధింపులకు టీడీపీ కార్యకర్త మృతి

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల వేధింపులకు టీడీపీ కార్యకర్త మృతిచెందాడు. సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని పోలీసులు తెలుగుదేశం కార్యకర్త కోన వెంకటరావుని తీవ్రంగా వేధించారు. మృతిచెందిన కోన వెంకటరావుది మందస మండలం పొత్తంగి గ్రామం. పోలీసులు ఆయనని ఊరు ఖాళీ చేసి వెళ్లిపోవాలని భయపెట్టారని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు వేధింపులు తట్టుకోలేకనే కోన వెంకటరావు పురుగులు ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కోన వెంకటరావు మృతిచెందడంతో జిల్లాలోని మందస మండలం పొత్తంగి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 


ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత

పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న టీడీపీ కార్యకర్త కోన వెంకటరావు మృతదేహన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కాగా ఈ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు తీవ్ర నిరసన తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న కోన వెంకటరావు కుటుంబ సభ్యులను డీఎస్పీ శివరామిరెడ్డి పరామర్శించి మాట్లాడారు. వేధింపులకు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునే వరకు మృతదేహన్ని తీసుకువెళ్లేది లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.

Updated Date - 2022-03-08T13:42:23+05:30 IST