ఎన్నారై డెస్క్: తెలుగోడి ఆత్మగౌరవాన్ని దేశం దశదిశలా వ్యాపింపచేసిన తెలుగుదేశం పార్టీ 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పిలుపు మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ సభ్యులు పార్టీ అవిర్భావ దినోత్సవ వేడులు ఘనంగా జరిపారు. ఎన్నారై టీడీపీ యూరప్ ఆధ్వర్యంలో డెన్మార్క్‌లో పార్టీ 40వ వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి.
వేదిక మొత్తం పసుపు పచ్చని తోరణాలతో నిండిపోగా.. పార్టీపై తమకు ఉన్న అభిమానానికి అవధుల్లేవని నిరూపించారు. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అనే నినాదాలతో వేదికను హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ సభ్యులు మాట్లాడుతూ.. పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడమే లక్ష్యంగా నాడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని గుర్తు చేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాధికారం రుచి చూపించిన ఘనత టీడీపీకే దక్కుందని పేర్కొన్నారు. అంతేకాకుండా పార్టీ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను స్మరించుకున్నారు.
డాక్టర్ కిశోర్ బాబు చలసాని సమన్వయంతో వెంకీ చింతపూడి, బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ సభ్యులు పాల్గొన్నారు. భవిష్యత్తులో పార్టీకి తమ సేవలను ఎలా ఉపయోగించాలి, ఎన్నికల్లో పార్టీకి ఏ విధంగా తోడుగా ఉండాలనే అంశాలపై చర్చ జరిగింది.
ఇవి కూడా చదవండి