తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్ బతుకమ్మ సంబురం

ABN , First Publish Date - 2022-10-02T02:17:05+05:30 IST

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఇక్కడి సంబవాంగ్ పార్క్‌లో అక్టోబర్ 1న ఎంతో కన్నుల పండువగా జరిగాయి.

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్ బతుకమ్మ సంబురం

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఇక్కడి సంబవాంగ్ పార్క్‌లో అక్టోబర్ 1న ఎంతో కన్నుల పండువగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా అనే లేకుండా అందరూ జోరైన పాటలు ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. ‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో..’’ పాటలతో ఈ వేడుకలు మిన్నంటాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది ఎన్నారైలు కలిపి సుమారు 3000 నుండి 4000 వరకు పాల్గొన్నారు. సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు వారికి, స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తు గత 13 సంవత్సరాలుగా పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా TCSS.. చరిత్రలో నిలిచిచపోయిందని సొసైటీ సభ్యులు అన్నారు. ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు ‘ఫర్నిచర్ వరల్డ్’ వారు బహుమతులు అందజేశారు. ఈ సంబురాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని, సంబరాలు విజయవంతంగా జరిగేందుకు సహాయసహకారాలు అందిస్తున్న దాతలతో పాటు ప్రతి ఒక్కరికి టీసీఎస్‌ఎస్‌ సభ్యులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.


ఈ ఏడు బతుకమ్మ సంబురాలకు సమన్వయకర్తలుగా గడప రమేశ్, సునీత రెడ్డి, రోజా రమణి, దీప నల్ల, రజిత రెడ్డి, నిర్మల రెడ్డి, అనుపురం శ్రీనివాస్ నంగునూరి సౌజణ్య, పద్మజ నాయుడు మొదలగువారు వ్యవహరించారు. ఈ సారి వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా TCSS ప్రత్యేకంగా నిర్మించిన సింగపూర్ బతుకమ్మ సింగారాల బతుకమ్మ నిలిచింది. ఈ పాటను TCSS సభ్యుడు కాసర్ల శ్రీనివాస రావు రచించి సంగీతం అందజేయగా..  ఈ గీతాన్ని శ్రావ్య అత్తిలి ఎంతో శ్రావ్యంగా ఆలపించారు. ఈ పాట ను యూట్యూబ్‌లో విడుదల చేసిన వెంటనే వేల ప్రధాన ఆకర్షణగా భారీగా వ్యూస్ వచ్చాయని తెలిపారు. 


ఈ సందర్భంగా అధ్యక్షులు  నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్,  రోజా రమణి, నంగునూరి  వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు.. గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్,  శశిధర్ రెడ్డి, పెరుకు శివ రామ్ ప్రసాద్, కాసర్ల శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, భాస్కర్ నడికట్ల,  శివ ప్రసాద్ ఆవుల మరియు రవి కృష్ణ విజాపూర్ గార్లు, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సభ్యులందరితో పాటు సొసైటీకి వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్నదాతలకు, ప్రతి ఒక్కరికి, ఈ సంబురాలను విజయవంతం చేడయడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ మహిళలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వీరితో పాటు ఇతర సభ్యులు ఎంతో మంది ముందుకు వచ్చి సహాయ సహకారం అందజేయడానికి ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఈ వేడుకలను సొసైటీ ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. 

Updated Date - 2022-10-02T02:17:05+05:30 IST