Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీసీఎస్... భారీ నియామకాలు

హైదరాబాద్ : ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను ఫలితాలను ప్రకటించింది. డిసెంబరు త్రైమాసికంలో మంచి ఆదాయాలు, లాభాలను నమోదు చేసింది. సంస్థ ఏకీకృత నికర లాభం రూ. 9,769 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 8,701 కోట్లు. ఆదాయం 16 శాతం పెరిగి రూ. 42,015 కోట్ల నుండి రూ. 48,885 కోట్లకు చేరుకుంది. నిపుణులను అట్టిపెట్టుకోవడం ద్వారా... ఆట్రిషన్ రేటును తగ్గించుకునే క్రమంలో... లక్ష మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులనివ్వడం, కొత్త నియామకాల నేపధ్యంలో కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్లు 0.60 శాతం తగ్గి 25 శాతానికి పరిమితమయ్యాయి.


స్టాక్ బైబ్యాక్... 

టీసీఎస్ రూ. 18 వేల కోట్ల(1.08 శాతం) బైబ్యాక్ పథకాన్ని ప్రకటించింది. ఒక్కో  షేర్‌కు... రూ. 4,500 ధరతో 4 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు ప్రకటించింది. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు పచ్చజెండా ఊపింది. బుధవారం టీసీఎస్ షేర్ రూ. 3857.25 వద్ద ముగిసింది. ఒక్కో షేర్‌కు రూ. 3 వేల చొప్పున రూ. 16 వేల కోట్ల బైబ్యాక్‌ను నిరుడు డిసెంబరు 18 న కూడా ప్రకటించింది.అలాగే ఒక్కో షేర్ పై రూ. 7 చొప్పున డివిడెండ్‌ను ఇస్తున్నట్లు తెలిపింది. డివిడెండ్ చెల్లింపులకు జనవరి 20 రికార్డ్ తేదీగా నిర్ణయించింది.


ఐటీకి కేటాయింపులు... టీసీఎస్ రూ. 1,87,500 కోట్ల ఆదాయం మైలురాయిని అధిగమించింది. అధిక వ్యయాలను తగ్గించుకోవడంపై, ఉద్యోగుల వ్యయాలను సరిగ్గా నిర్వహించడంపై తమ దృష్టి కొనసాగుతుందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ షెక్సారియా వెల్లడించారు. చాలావరకు కొత్త క్లయింట్స్ కొత్త ఏడాదిలో ఐటీకి కేటాయింపులు జరుపుతున్నందున రాబోయే రోజుల్లోనూ రాణించగలమని పేర్కొన్నారు. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ 7.8 బిలియన్ డాలర్ల కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు వెల్లడించారు.


భారీ నియామకాలు... 

నిరుడు డిసెంబరు 21 నాటికి కంపెనీలో 28,238 నియామకాలను చేపట్టింది. ఈ క్రమంలో... కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2,56,986 కు చేరుకుంది. ఉద్యోగుల వలస(ఆట్రిషన్) రేటు 15.3 శాతంగా నమోదైంది. కంపెనీ వద్ద నిల్వలు రూ. 59,920 కోట్లుగా ఉన్నాయి. ఇక... 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 43 వేల మంది ఫ్రెషర్లను,  మూడో త్రైమాసికంలో మరో 34 వేల మందిని నియమించుకుంది. మొత్తంమీద... తొమ్మిది  నెలల్లో 77 వేల  నియామకాలను చేపట్టింది. 

Advertisement
Advertisement