రూ. 9 లక్షల కోట్లు దాటిన టీసీఎస్ మార్కెట్ వాల్యువేషన్

ABN , First Publish Date - 2020-09-14T22:39:51+05:30 IST

ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మార్కెట్ వాల్యువేషన్

రూ. 9 లక్షల కోట్లు దాటిన టీసీఎస్ మార్కెట్ వాల్యువేషన్

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మార్కెట్ వాల్యువేషన్ రూ. 9 లక్షల కోట్లు దాటేసింది. సోమవారం స్టాక్‌మార్కెట్‌లో టీసీఎస్ షేర్ల విలువ అమాంతం పెరిగిపోయింది. బీఎస్ఈ(బాంబే స్టాక్ ఎక్స్చేంజ్)లో కంపెనీ షేర్ విలువ 2.91 శాతం పెరగడంతో.. ఒక్క షేర్ ధర రూ. 2,442.80కు చేరింది. అదే విధంగా ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్)లో 2.76 శాతం పెరిగి రూ. 2,439.80గా ఉంది. షేర్ ధర భారీగా పెరగడంతో మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా రూ. 9,14,606.25 కోట్లకు చేరుకుంది. భారతదేశంలో ఇప్పటివరకు రూ. 9 లక్షల కోట్ల మార్కెట్ వాల్యూను దాటిన ఏకైక సంస్థగా రిలయన్స్ మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి టీసీఎస్ కూడా వచ్చి చేరింది. టెక్ కంపెనీల పరంగా చూస్తే ఈ రికార్డును కొట్టిన మొట్టమొదటి సంస్థ టీసీఎస్ అనే చెప్పాలి.

Updated Date - 2020-09-14T22:39:51+05:30 IST