Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొత్త ఫీచర్లతో TCL Tablets విడుదల

న్యూఢిల్లీ: ప్రముఖ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్స్ సంస్థ టీసీఎల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. భారత మార్కెట్‌లో అద్భుత ఫీచర్లతో టీసీఎల్ 10 టాబ్ మ్యాక్స్ 4జీ, టీసీఎల్ 10 టాబ్ మాక్స్ (వై-ఫై), టీసీఎల్ టాబ్ 10 4జీ ఎఫ్‌హెచ్‌డీ, మరియు టీసీఎల్ టాబ్ 10 ఎస్ (వై-ఫై)  టాబ్లెట్లను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. టీసీఎల్ టాబ్లెట్ ప్రారంభ ధర రూ.15,999 ఉంటుందని కంపెనీ పేర్కొంది. టీసీఎల్ టాబ్ 10లను మొదట సీఇఎస్ 2021లో జనవరిలో ప్రవేశపెట్టారు. ఈ టాబ్లెట్ మోడళ్లతో పాటు టీసీఎల్ టాబ్ 10 4జీ ఎఫ్‌హెచ్‌డి టాబ్లెట్ ఇప్పుడు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయని కంపెనీ తెలిపింది.

Advertisement
Advertisement