మడత ఫోన్‌ కాదు... తనలో తానే ఇమిడిపోయే ఫోన్‌!

ABN , First Publish Date - 2020-03-07T02:31:47+05:30 IST

2019 లో మొదలైన కర్వ్‌డ్‌ ఫోన్‌ ఫీవర్‌ 2020 లో కూడా కంటిన్యూ అవుతోంది.

మడత ఫోన్‌ కాదు... తనలో తానే ఇమిడిపోయే ఫోన్‌!

2019 లో మొదలైన కర్వ్‌డ్‌ ఫోన్‌ ఫీవర్‌ 2020 లో కూడా కంటిన్యూ అవుతోంది. మోటోరోలా నుంచి శామ్‌సంగ్‌ వరకూ, హ్యువావీ నుంచి టీసీఎల్‌ వరకూ ఈ బ్రాండ్‌ ఆ బ్రాండ్‌ అని లేకుండా - అనేక కంపెనీలు రకరకాల ఫోల్డబుల్‌ ఫోన్స్‌ని తయారుచేస్తు్న్నాయి. కొన్ని ఫోన్‌ కంపెనీలు ఫోల్డింగ్‌ ద్వారా ఫోన్‌ సైజ్‌ని తగ్గిస్తే.. మరి కొన్ని ఫోన్‌ కంపెనీలు ఫోల్డింగ్‌ ద్వారా కస్టమర్‌కి రెట్టింపు స్క్రీన్‌ని అందించే ప్రయత్నం చేస్తున్నాయి.


ఇటీవల చైనీస్‌ టెక్‌ కంపెనీ టీసీఎల్ ‌( TCL ) కంపెనీ రెండు కాన్సెప్ట్‌ ఫోన్లను ప్రకటించింది. వాటిలో ఒక ఫోన్‌ భలే వింతగా ఉంది. అందులో విచిత్రం ఏంటంటే - ఫోన్‌ స్క్రీన్‌ ని మడత పెట్టడం కాకుండా సగం స్క్రీన్‌ మిగిలిన సగం స్క్రీన్‌ లోపలికి పోతుంది. అంటే ఒరలోకి కత్తి వెళ్లిన మాదిరిగా ఇలా ఫోన్‌ లో సగభాగం మిగతా సగంలో ఇమిడిపోతుందన్నమాట. అయితే ఆ భాగాన్ని బయటికి లాగినప్పుడు రెండిటిమీదా కలిపి స్క్రీన్‌ పనిచేస్తుంది. చూడ్డానికే ఎంతో వింతగా ఉన్న ఈ ఫోన్‌ భవిష్యత్తులో తప్పకుండా సంచలనం సృష్టిస్తుందని టీసీఎల్‌ వారు భావిస్తున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే - దీనిని ఫోల్డింగ్‌ ఫోన్‌ అనకూడదు. ఎందుకంటే -  ఫోన్‌ స్క్రీన్‌ని చిన్నగా,పెద్దగా చేయడానికి దీంట్లో వాడుతున్నది ఫోల్డింగ్‌ టెక్నాలజీ కాదు.  ఖాళీ ప్లేస్‌లో ఇమిడిపోయే రిట్రాక్టింగ్‌ టెక్నాలజీ.


ప్రస్తుతానికి ఇంకా ఈ రిట్రాక్టింగ్‌ ఫోన్‌ బయటకి రాలేదు. ఇంకా ఇది కాన్సెప్ట్‌ స్థాయిలోనే ఉంది. అయితే ఇది సక్సెస్‌ అయితే ఫ్యూచర్లో

ఫోల్డబుల్‌ ఫోన్లకి గట్టి కాంపిటీషన్‌ ఇస్తుందని అంటున్నారు.

Updated Date - 2020-03-07T02:31:47+05:30 IST