పన్నులు లేని దేశం!

ABN , First Publish Date - 2020-09-25T05:30:00+05:30 IST

అందమైన దీవుల సముదాయమైన ఈ దేశంలోని ప్రజలకు ట్యాక్స్‌ అంటే ఏమిటో తెలియదు...

పన్నులు లేని దేశం!

అందమైన దీవుల సముదాయమైన ఈ దేశంలోని ప్రజలకు   ట్యాక్స్‌ అంటే ఏమిటో తెలియదు. ఇక్కడి వారికి రైలు కూత కూడా తెలియదు. ‘కామన్‌వెల్త్‌ ఆఫ్‌ ద బహమాస్‌’ అని పిలిచే ఈ ద్వీపం కబుర్లు ఇవి...


  • ఈ దేశంలో చాలా దీవులు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే నివాసానికి అనువైనవి. ఈ దేశ రాజధాని నగరం నస్సావు. అతి పెద్ద నగరం కూడా అదే.

  • క్యూబా, హైతీ, యునైటెడ్‌ స్టేట్స్‌తో సరిహద్దులు కలిగి ఉంది. బెర్ముడా ట్రయాంగిల్‌ ఈ దీవుల పక్కనే ఉంటుంది. 

  • బహమాస్‌ ప్రజలు ఎలాంటి పన్నులు చెల్లించరు. దిగుమతి సుంకాల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

  • బహమియన్‌ డాలర్‌ ఈ దేశ కరెన్సీ. ఇది అమెరికా డాలర్‌తో సమానమైన విలువ కలిగి ఉంటుంది. అందుకే ఈ దీవిలో అమెరికా డాలర్‌ను ఉపయోగించుకొనేందుకు అనుమతిస్తారు.

  • యునైటెడ్‌ స్టేట్స్‌, కెనడా దేశాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. మూడు వారాల కన్నా తక్కువ రోజులు గడిపేందుకు వచ్చే ఆ దేశ పర్యాటకులకు వీసా అవసరం లేదు. బీచ్‌లు, రిసార్టులతో ఈ దీవులు ఆకర్షణీయంగా ఉంటాయి. పర్యాటకం రూపంలో బహమాస్‌కు ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది.

  • ఇతర దేశాల వారు కూడా ఇక్కడ గ్యాంబ్లింగ్‌ ఆడేందుకు చట్టపరమైన అనుమతి ఉంది.

Updated Date - 2020-09-25T05:30:00+05:30 IST