Abn logo
Oct 27 2021 @ 00:47AM

పేదోళ్లకు పన్నులు... పెద్దోళ్లకు రాయితీలు

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు దారుణం 

 సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపాటు


అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 26: పేద ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారం మోపుతూ, పెద్దోళ్లకు రాయితీలు ఇస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, ఇది రెండు ప్రభుత్వాల పతనానికి నాంది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. మం గళవారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవనలో నిర్వహించిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావే శానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి పేదలపై ఆర్థిక భారాన్ని మోపి, పెద్దోళ్లకు మాత్రం ప్రభుత్వ రాయితీలు, మినహాయింపులు ప్రకటించి ప్రజావ్య తిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మండి పడ్డారు. అటు పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌, ఇటు నిత్యావసర సరుకుల ధరలు పెంచుకుంటూ పోతున్నారన్నారు. ఏడాదిన్నర వ్యవధిలో పెట్రోలు, డీజిల్‌పై రూ.35కి పైగా పెంచడం దుర్మా ర్గమ న్నారు. ఇక రాష్ట్రంలో ఇంటికి, నీటి, చెత్తకు పన్నులు విధిస్తూ చెత్త ప్రభుత్వంగా మారిందని విమ ర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరస నగా ఈనెల 29వ తేదీన చేపట్టే బంద్‌లో అన్నివ ర్గాల ప్రజలు భాగస్వా ములై విజయవంతం చే యాలని కోరారు.  కార్యక్ర మంలో సీపీఐ జిల్లా కా ర్యదర్శి జగదీష్‌, సహాయ కార్యదర్శులు జాఫర్‌, నా రాయణ స్వామి, కార్యదర్శివర్గ సభ్యులు రాజారెడ్డి, మల్లికార్జున, వేమయ్య యాదవ్‌, కార్యవర్గసభ్యులు అమీనమ్మ, గోవిందు, కాటమయ్య, శ్రీరాములు, కేశవరెడ్డి, రామకృష్ణ, టీ నారాయణస్వామి, చ లపతి, పద్మావతి, పెద్దయ్య, మధు, నాగార్జున పాల్గొన్నారు.


బంద్‌కు అన్నివర్గాల ప్రజలు మద్దతివ్వాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్ర జావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 29వతేదీన చేపట్టే బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతిచ్చి, విజయవంతం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు కోరారు. మంగళవారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డిభవనలో నిర్వహించిన స మావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌, సీ పీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌, సీపీఐఎంఎల్‌ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ యూసీఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర మాట్లాడు తూ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.